సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు కూడా వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలు ఉంటాయి.కాని వాటిని బయట పెట్టుకోవడానికి ఇష్టపడరు.
కేవలం తెర ముందు అలా ఉంటారు కానీ తెర వెనుక వాళ్ళు ఎంతో బాధను మోస్తూ ఉంటారు.ఇప్పటికి చాలామంది నటీనటులు ఎన్నో బాధలు మోయగా కొంతమంది నటీనటులు తమ బాధను బయటికి చెప్పుకున్నారు.
అయితే ఇదంతా పక్కన పెడితే.ఒకప్పటి హీరో రాజేష్ కూడా ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు.అప్పటి హీరో రాజేష్ గురించి ఈ తరం ప్రేక్షకులకు తెలియదు కానీ.ముందు తరం ప్రేక్షకులకు మాత్రం ఈయన బాగా పరిచయం.
ఇక ఈయన కూతురు ఎవరో కాదు ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం ఈమె కోలీవుడ్లో మంచి గుర్తింపుతో కొనసాగుతుంది.
ఇక రాజేష్ అక్క కూడా ఎవరో కాదు ఒకప్పటి లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి. ఇక రాజేష్ దాదాపు 54 సినిమాలలో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇక ఈయనకు చిన్నవయసులోనే పెళ్లి కావడంతో అతి చిన్న వయసులోనే నలుగురి పిల్లలను కన్నాడు.ఈ విషయాలన్నీ తాజాగా శ్రీలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తెలిపింది.
తను సినిమాలలో నటిస్తున్నప్పుడు తన తమ్ముడు రాజేష్ తనను సినిమాలలో నటించవద్దని అన్నాడట.కానీ బ్రతకటానికి మార్గం ఇదే అని కాబట్టి అందరం కలిసి చేసుకుంటే తప్పు ఉండదు అని అన్నదట.ఇక తన తమ్ముడు రాజేష్ జంధ్యాల తెరకెక్కించిన సినిమాలలో కూడా నటించాడని తెలిపింది.ఇక తను స్టార్ హీరోగా అయ్యే సమయంలో తాగుడుకు బానిసయ్యాడని దాంతో అతని ఆరోగ్యం క్షీణించి చనిపోయాడని తెలిపింది.
ఆ తర్వాత రాజేష్ భార్య తన పిల్లలను ఎంతో కష్టంగా పెంచుకుందని తెలిపింది.అయితే ఇద్దరూ కొడుకులు కూడా చనిపోయారని.
అది కూడా దాదాపు 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు చనిపోయారని తెలిపింది.ఒక కొడుకు సూసైడ్ చేసుకున్నాడని.
అది కూడా ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడని.ఆ తర్వాత వాళ్ళు ఆ విషయాన్ని ఫోన్ చేసి కూల్ గా చెప్పారని తెలిపింది శ్రీలక్ష్మి.
ఇక మరో అబ్బాయి వినాయక చవితి ముందు బైక్ మీద స్పీడ్ గా చనిపోయాడని తెలిపింది.దీంతో ఆ ఇంట్లో మగదిక్కు లేకుండా పోయిందని బాధపడింది.ఇక ఆ తర్వాత తన మేనకోడలు ఐశ్వర్య రాజేష్ ఎవరి సపోర్ట్ లేకుండా యాంకర్ గా అడుగుపెట్టి ఆ తర్వాత పలు సినిమాలలో చిన్న పాత్రలలో నటించింది.
ఆ తర్వాత తనే హీరోయిన్ గా మారి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.
ప్రస్తుతం స్టార్ హీరోయిన్లకు పోటీగా దూసుకెళ్తుంది.తెలుగులో కూడా నటించి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది.
మొత్తానికి తన తండ్రి లేకున్నా కూడా ఒంటరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన తండ్రి పేరును, గౌరవాన్ని కాపాడుతుంది.