యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన విషయం తెలిసిందే.బాహుబలి సినిమా హిట్ తర్వాత ప్రభాస్ తో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టారు.
దీంతో ప్రభాస్ వరుస సినిమాలు అనౌన్స్ చేసి ఆయన ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు.ఈయన చేతిలో అన్ని భారీ బడ్జెట్ సినిమాలే ఉన్నాయి.
అందులో సలార్ ఒకటి.కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచు కుంటున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతుంది.ఈయన ఇప్పటి వరకు పోషించని పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.రాధేశ్యామ్ ఇచ్చిన ప్లాప్ నుండి బయట పడాలంటే అంతకు మించిన డార్లింగ్ అప్డేట్ ఏదో ఒకటి ఉండాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండి ప్రశాంత్ నీల్ ను అప్డేట్ కోసం అడుగుతున్న విషయం తెలిసిందే.
మరి నీల్ ఇప్పటికి వీరి మోర విని ఈ సినిమానుండి బ్లాస్టింగ్ అప్డేట్ అందించాడు.నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ సంతోషంతో పిచ్చెక్కి పోతున్నారు.
ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.అయితే ఈ రిలీజ్ డేట్ గురించి ఒక పక్క సంతోషంగా ఉన్నా మరో పక్క ప్రభాస్ ఫ్యాన్స్ భయపడుతున్నారు.
అందుకు కారణం కూడా ఉంది.మన ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్స్ ఉన్న విషయం తెలిసిందే.ఇప్పుడు సలార్ రిలీజ్ డేట్ విషయంలో కూడా ఫ్యాన్స్ ఒక సెంటిమెంట్ కు భయపడుతున్నారు.సెప్టెంబర్ 28నే ప్రభాస్ నటించిన రెబల్ సినిమా రిలీజ్ అయ్యి అట్టర్ ప్లాప్ అయ్యింది.
ఈ సినిమా వల్ల చాలా నష్టం కూడా వచ్చింది.
అందుకే ఇప్పుడు సలార్ అదే డేట్ కి రాబోతుండడంతో అంతా భయపడుతున్నారు.
అయితే ఈ సినిమా మేకర్స్ మాత్రం ఈ సినిమా విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.చూడాలి ఏం జరుగుతుందో.
ఇక ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.