టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి వారిలో నటుడు నిఖిల్ ( Nikhil ఒకరు.ప్రస్తుతం ఈయన స్వయంభు( Swayambu ) అనే సినిమాలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నిఖిల్ ప్రస్తుతం స్వయంభు సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన స్వయంభు సినిమా విడుదల తేదీ గురించి అదే విధంగా తన కుమారుడి గురించి కూడా పలు విషయాలను వెల్లడించారు.
నిఖిల్ 2021 వ సంవత్సరంలో పల్లవి( Pallavi ) అనే డాక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ దంపతులకు ఇటీవల కుమారుడు జన్మించారు.తన కుమారుడికి సంబంధించిన ఫోటోలను ఈయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అయితే ఇప్పటివరకు తన కుమారుడి పేరు మాత్రం వెల్లడించలేదు.తాజాగా తన కొడుకు గురించి మాట్లాడుతూ తనకు బాబు పుట్టిన తర్వాత ఎక్కువ సమయం తనకు కేటాయిస్తున్నానని వెల్లడించారు.
తన కొడుకు పేరు ధీర సిద్దార్థ్( Dheera Siddarth ) అని తెలియజేశారు.తన కొడుకు చాలా త్వరగా పెరుగుతున్నారు అనిపిస్తుందని ఈయన తెలిపారు.పిల్లవాడి బాధ్యతను పెంచుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నానని నిఖిల్ వెల్లడించారు.వారానికి ఒక్కసారైనా పార్టీకి వెళ్లడం నాకు అలవాటుగా ఉండేదని తెలిపారు.అయితే బాబు పుట్టిన తర్వాత ఈ అలవాటును పూర్తిగా మానుకున్నానని నిఖిల్ తెలిపారు.మన పిల్లలకు మంచి వాతావరణంలో పెరగాలి అంటే మనలో కొన్ని మార్పులను చేసుకోవడం ఎంతో ముఖ్యమని అందుకే తాను పార్టీలకు వెళ్లడం పూర్తిగా మానుకున్నానని ఈ సందర్భంగా నిఖిల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.