ఆముదం( Castor Oil ) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.ఆహార, ఔషధ, అందచందాల ఉత్పత్తుల్లో ఆముదం విస్తృతంగా ఉపయోగించబడుతోంది.
ఆముద చెట్టు గింజల నుంచి తయారు చేయబడే ఆముదం నూనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.అందువల్ల ఆముదం అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ముఖ్యంగా మలబద్ధకం( Constipation ) సమస్యతో బాధపడుతున్న వారికి ఆముదం ఒక న్యాచురల్ మెడిసిన్ మాదిరి పని చేస్తుంది.ఉదయం పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని వాటర్ లేదా గోరు వెచ్చని పాల్లో వన్ టీ స్పూన్ ఆముదం కలిపి తీసుకోవాలి.
వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది.మలబద్ధకం సమస్య పరార్ అవుతుంది.
అలాగే కీళ్ల నొప్పుల( Knee Pains ) నివారణకు కూడా ఆముదం అద్భుతంగా సహాయపడుతుంది.ఆముదం నూనెను వేడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో అప్లై చేసి సున్నితంగా మర్దన చేయాలి.
ప్రతి రోజూ ఇలా చేశారంటే కీళ్ల నొప్పులకు బై బై చెప్పవచ్చు.
జలుబు మరియు దగ్గు( Cold Cough ) ఉపశమనం పొందాలనుకుంటే ఆముదం నూనెను కొంచెం వేడి చేయాలి.ఇప్పుడు ఈ నూనెను ఛాతీపై ఆప్లై చేసుకుని మర్దన చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు ఈ విధంగా చేస్తే జలుబు, దగ్గు తగ్గుముఖం పడతాయి.
బాడీని డీటాక్స్ చేసే సత్తా కూడా ఆముదానికి ఉంది.ఆముదం నూనెను గోరువెచ్చని నీటిలో కొద్దిగా కలిపి తీసుకోవడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగిపోతాయి.
అలాగే ఆముదం చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది.ముఖ్యంగా ప్రస్తుత చలికాలంలో పొడిబారిన చర్మంపై రాత్రిపూట ఆముదం నూనెను రాసి ఉంచితే చర్మం మృదువుగా మారుతుంది.
జుట్టు పెరుగుదలకు( Hair Growth ) కూడా ఆముదాన్ని ఉపయోగించవచ్చు.ఆముదాన్ని కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెతో కలిపి తలకు పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.
గంట అనంతరం తలస్నానం చేయాలి.వారానికి ఒకసారి ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.
అయితే ఆముదం నూనెను అధిక మోతాదులో వాడకూడదు.గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, మరియు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు ఆముదాన్ని వాడేముందు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.మరియు శుద్ధి చేసిన ఆముదం నూనెనే ఎంపిక చేసుకోవాలి.