2024లో భారత్‌లోని యూఎస్ ఎంబసీ ఎన్ని వీసాలను జారీ చేసిందంటే?

భారతదేశంలోని యూఎస్ మిషన్ వరుసగా రెండో ఏడాది 10 లక్షలకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను( Non-Immigrant Visas ) జారీ చేసినట్లు ప్రకటించింది.ఇందులో రికార్డు స్థాయిలో టూరిస్ట్ వీసాలు( Tourist Visas ) ఉన్నాయి.

 Us Embassy Issued Over 1 Million Non-immigrant Visas To Indians Details, Us Emba-TeluguStop.com

ఇది యూఎస్( US ) ప్రయాణానికి భారతీయుల డిమాండ్‌ను నొక్కి చెబుతుంది.హెచ్ 1 బీ- వీసాలను( H1-B Visa ) పునరుద్ధరించడానికి ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా 2025లో భారతీయులకు పెద్ద సంఖ్యలో ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

గడిచిన నాలుగేళ్లుగా భారత్ నుంచి అమెరికాకు వెళ్లే సందర్శకుల సంఖ్య నాలుగైదు రెట్లు పెరిగింది.2024 మొదటి 11 నెలల్లోనే సుమారు 2 మిలియన్లకు పైగా భారతీయులు యూఎస్‌కు ప్రయాణించారు.ఇది 2023తో పోలిస్తే 26 శాతం పెరుగుదల.ఇప్పటి వరకు 5 మిలియన్లకు పైగా భారతీయులు అమెరికాను సందర్శించడానికి వీలుగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాను కలిగి ఉన్నారు.

ప్రతి రోజూ వేలాది మందికి ఇది జారీ చేస్తున్నట్లు యూఎస్ ఎంబసీ( US Embassy ) తెలిపింది.

Telugu Immigrant Visas, America, Visa, India, Indians, Embassy, Immigrant Visa,

మరోవైపు.భారతీయులకు యూఎస్ మిషన్ వరుసగా రెండో ఏడాది ఒక మిలియన్‌కు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాను జారీ చేసింది.ఇందులో రికార్డు స్థాయిలో సందర్శకుల వీసాలు ఉన్నాయి.

పర్యాటకం, వ్యాపారం, విద్య కోసం అమెరికా వెళ్లడానికి భారతీయులు ఎంతగా పోటెత్తుతున్నారో ఇది తెలియజేస్తుంది.అలాగే అమెరికాలో హెచ్ 1 బీ వీసాలను పునరుద్ధరించడానికి విదేశాంగశాఖ విజయవంతంగా పైలట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిందని రాయబార కార్యాలయం తెలిపింది.

Telugu Immigrant Visas, America, Visa, India, Indians, Embassy, Immigrant Visa,

అలాగే భారతదేశానికి యూఎస్ మిషన్ దాదాపు 10 వేల వలస వీసాలను జారీ చేసింది.ఇది చట్టబద్ధమైన కుటుంబ పునరేకీకరణ, నైపుణ్యం కలిగిన వలసలను సులభతరం చేసింది.భారత్‌లో నివసిస్తున్న వారికి, అమెరికాకు ప్రయాణించే ఆ దేశ పౌరులకు 24 వేలకు పైగా పాస్‌పోర్ట్‌లు, ఇతర కాన్సులర్ సేవలను భారత్ లోని యూఎస్ మిషన్ అందించింది.గణాంకాల ప్రకారం భారతీయ గ్రాడ్యుయేట్ విద్యార్ధుల సంఖ్య 19 శాతం పెరిగి దాదాపు 2,00,000కు చేరుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube