మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలామంది బిర్యాని అంటే ఎంతో ఇష్టంగా తింటారు.కానీ తినే తిండి విషయంలో ఎన్నో అప్పుహాలు వస్తూ ఉంటాయి.
కొన్ని తినే వస్తువులను తినొద్దని కొంతమంది చెబుతూ ఉంటారు.ఇటీవల కొందరు పచ్చళ్ళు తింటే ఏం కాదని చెబుతుంటే కానీ మరికొందరు పచ్చళ్లలో ఉప్పు నూనె మన ఆరోగ్యానికి నష్టం చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.
తాజాగా బిర్యాణీ విషయంలో కొన్ని వార్తలు వస్తున్నాయి.తాజాగా టీఎంసీ నేత రవీంద్ర నాథ్ ఘోష్ బిర్యాణీ తింటే మగతనం తగ్గిపోతుందని చె్ప్పడం సంచలనంగా మారింది.
ప్రపంచంలోనే బిర్యాణీ ప్రేమికులు చాలా ఉన్న వారు మాత్రం తినకుండా ఉండలేరు.వారంలో నాలుగైదు సార్లయినా బిర్యాణీ ని కచ్చితంగా తింటూ ఉంటారు.అలాంటి బిర్యాణీపై ఇప్పుడు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.కొందరు కావాలనే బిర్యాణీ విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.
బిర్యాణీ తినడం వల్ల పురుషుల్లో మగతనం తగ్గుతుందనే మాటలు బిర్యాణీ ప్రేమికుల్లో ఆందోళన కలిగిస్తుంది.
బిర్యాణీలో వాడే మసాలాలతో మగవారి ఆరోగ్యం పై దుష్ఫరిణామాలు ఉంటాయని చెబుతున్నారు.
దీంతో బిర్యాణీ తినే వారిలో లైంగిక సామర్థ్యం తగ్గుతుందని చెప్పడంతో ప్రస్తుతం బిర్యాణీ తింటే నిజంగానే నష్టం కలుగుతుందా అనే ఆలోచనలో బిర్యాని ప్రేమికులు ఉన్నారు.భవిష్యత్ లో బిర్యాణీ తింటే ఇన్ని అనర్థాలు వస్తాయని చెబుతుండటంతో ఇక బిర్యాణీ తినకూడదని చాలామంది అనుకుంటూ ఉన్నారు.
దీంతో మాంసాహారులు జాగ్రత్తగా ఉండాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.
బిర్యాణీ తినడం వల్ల కలిగే అనర్థాలపై ఎలాంటి ఆధారాలు మాత్రం లేవు.దీనిపై అనవసరంగా మాట్లాడటంతో బిర్యాణీ తినేవారు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది.ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడటంతో బిర్యాణీ తినేవారికి ఎలాంటి నష్టం లేదని చెబుతున్నారు.
శాస్త్రీయ ఆధారాల్లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.