60 ఏళ్ల క‌ల సాకారాన్ని చిదిమేసిన కుటుంబ పాల‌న‌!

తెలంగాణ రాష్ట్రం పెనం నుంచి నిప్పుల్లో పడిన విధంగా మారిపోయింది.సమైక్య రాష్ట్రంలో సరైన ప్రాతినిధ్యం లేదని, ఆత్మగౌరవం లేని చోట అభివృద్ధి ఎంత జరిగినా అది నిరర్థకమేనని తెలంగాణ ప్రజానీకం భావించారు కాబట్టే నాటి పాలకులు అభివృద్ధి గురించి ఎన్ని మాటలు చెప్పినా ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగరవేసి తెలంగాణ ప్రజానీకం స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు.

 60 Years Of Dream Come True Family Rule , Family Rule ,60 Years Of Dream,cm Kcr-TeluguStop.com

కానీ 60 ఏళ్ల కల సాకారమైందన్న సంతోషం , ఆనందం ఆరేండ్లు కూడా లేకుండా పోయింది.తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగురుతుందని ఆశిస్తే అంతా ఒక కుటుంబానికి పరిమితమైపోయింది.

సమైక్య రాష్ట్రం భౌగోళికంగా వేరుపడ్డదే తప్ప అణచివేత ,దోపిడీ ,అవమానాలు, అపహాస్యాలు అలానే మిగిలి ఉన్నాయి అవినీతి అప్పటికంటే పదింతలు పెరిగింది.ఆనాడు తెలంగాణ ఆదాయాన్ని వలసవాదులు, బడా కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారని గగ్గోలు పెట్టినమో ఇప్పుడు వారికి మరో కుటుంబం తోడైందే తప్ప దోపిడీ, అక్రమార్జన ఎక్కడ ఆగనే లేదు.

ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి ప్రశ్నించే వారిని శిక్షించే దుష్ట సంస్కృతి తెలంగాణలో నేడు తెరపైకి వచ్చింది.నాదే రాజ్యం అంతా నా ఇష్టం అన్న చందంగా పాలన సాగుతోంది ఆనాడు పోరాటంలో వందలాదిమంది దళిత బహు జనులు ప్రాణత్యాగం చేసి సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు వారి మనుగడే ప్రశ్నార్థకమైంది.

తెలంగాణ వస్తే స్వరాష్ట్రంలో స్వతంత్రంగా జీవించవచ్చని భావించిన వారికి నిరాశే మిగిలింది.స్వరాష్ట్రమైతే వచ్చింది కానీ స్వతంత్రం మాత్రం లేదనిపిస్తోంది.

ప్రశ్నించిన పాపానికి ఇద్దరు న్యాయవాదుల దంపతులను నడిరోడ్డుపైనే నరికి చంపిన దుస్సంఘటన మన రాష్ట్రంలో జరిగింది.

ఈ హత్యకు బాధ్యులుగా ఒక టిఆర్ఎస్ నేతపై ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు.

సోషల్ మీడియా ద్వారా వాస్తవాన్ని ప్రపంచ దృష్టికి తీసుకు వస్తున్న ఎందరో ఉద్యమకారులను జైల్లో పెట్టిన ప్రభుత్వం మనది.భావ ప్రకటన స్వేచ్ఛ ప్రగతిభవన్లో బందీ అయింది.

టిఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీ ఏ ఒక్కటి కూడా అమల్లోకి రాలేదు. కేజీ టు పీజీ విద్య ఏమైంది డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎన్ని కట్టిండ్రు ఇంటికో ఉద్యోగం ఎటు పోయింది, ఉచిత యూరియా ఎక్కడ ఇస్తున్నారు.

నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ముగ్గురికన్నా ఇచ్చిండ్రా, హాస్టల్ విద్యార్థులకు సన్న బువ్వ పెడతామన్న హామీ ఏమైంది, పురుగుల అన్నమే వారికి దిక్కయింది.ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామన్న హామీ గంగలో కలిసింది.

ధరణి పేరుతో ఓ దరిద్రపు పథకాన్ని తీసుకొని వచ్చి పేదల భూములను పెద్దలకు ధారా దత్తం చేసే కార్యక్రమం యదేచ్చగా కొనసాగుతూనే ఉంది.

గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి పేరుతో పథకాలను ప్రవేశపెట్టి ఒక్కటి కూడా అమల్లో పెట్టని ప్రభుత్వం ఇది. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల ఈ నియోజకవర్గాలు అభివృద్ధి బాట పడితే చాలా తెలంగాణ అంత తెరలైపోయిన పట్టించుకోరా.తెలంగాణలోని ప్రజానీకం కట్టిన పనులే ఖజానాను నింపుతున్నాయి.

అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని సమదృష్టితో చూడాల్సిన ముఖ్యమంత్రి గారు ప్రాంతాలపై పక్షపాతం చూపడం ఎంతవరకు సమంజసం.ఈ పక్షపాత ధోరణిని ప్రశ్నిస్తూనే తమ తమ నియోజకవర్గాలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని గళమెత్తాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేతగాని తనంతో గంపగుత్తగా వెళ్లి టిఆర్ఎస్ లో కలిశారు.

కానీ గళం ఎత్తి అక్రమాల్ని ప్రశ్నించి వివక్షతను ఎత్తిచూపుతూ తన పదవికి రాజీనామా చేసి ప్రభుత్వ వివక్షతను ప్రజల ముందు పెట్టిన నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.అమ్ముడు పోయాడా, ఆగ్రహించాడా ఇప్పుడు ఆలోచించాల్సింది ఇదే రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోవాల్సి వస్తే గతంలోనే మంత్రి పదవి ఆశ చూపించినప్పుడు , కెసిఆర్ ప్రలోభాలు పెట్టినప్పుడు అందరిలా టిఆర్ఎస్ లో చేరి హోం మంత్రి అయ్యేవాడు.

రాష్ట్రంలో నడుస్తున్న నిర్మాణపు పనుల కాంట్రాక్టులన్నీ ఆయన కంపెనీకి ఇప్పించుకునేవాడు.అలా అయితే లక్షల కోట్ల కాంట్రాక్టు రాజగోపాల్ రెడ్డికి దక్కేవి.కానీ అలా చేయకుండా ఇతర ఎమ్మెల్యే ల మాదిరి నీతి నియమం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించలేదు.తనకు కాంగ్రెస్ ద్వారా సంక్రమించిన పదవిని త్యాగం చేసి ప్రజల ముందు అగ్నిపరీక్షకు నిలబడ్డాడు.

ఉప ఎన్నికలు వస్తేనే ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని దుబ్బాక హుజురాబాద్ ఎన్నికల ద్వారా స్పష్టం కావడంతో తన నియోజకవర్గం కూడా అభివృద్ధి కావాలంటే రాజీనామా ఒక్కటే మార్గమని ఆయన భావించారు.అందుకే రాజీనామా చేసి బలిపీఠంపై నిలబడ్డారు.

రాజీనామా చేసినప్పుడు మళ్లీ కాంగ్రెస్ టికెట్ పైనే పోటీ చేయొచ్చు కదా అని ప్రశ్నించే వారికి సమాధానం చెప్పాల్సి ఉంది.

Telugu Dream, Cm Kcr, Rule, Gajwel, Sheep Scheme, Siddipet, Sirisilla, Telangana

కాంగ్రెస్ పోరాటపటిమను పూర్తిగా కోల్పోయింది.12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి టిఆర్ఎస్ లో చేరితే కనీస స్పందన కూడా కరువైంది.కాంగ్రెస్కు ఓటేస్తే టిఆర్ఎస్ కు వేసినట్లేనని ప్రజలు భావిస్తున్న తరుణంలో మళ్లీ ఆ పార్టీ ద్వారానే టిఆర్ఎస్ ని ఎదుర్కోవడం కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లే అవుతుందని భావించి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీని వదిలిపెట్టి బిజెపిలో చేరారు.

రాజీనామా ప్రకటన వెలుపడంతోనే ప్రభుత్వంలో కదలిక మొదలైంది.సాధ్యం కాదనుకున్న గట్టుప్పల్ మండల కేంద్రమైంది.గొర్రెల స్కీమ్ లో గొర్రెలకు బదులు లబ్ధిదారులకు 96 కోట్ల రూపాయల నగదు వారి ఖాతాల్లో జమ అయింది.ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న పట్టించుకోని ప్రభుత్వం రహదారుల కోసం కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి పనులు ప్రారంభించింది.

ఆగిపోయిన 30 పడకల ఆసుపత్రిని అఘ మేఘాల మీద పూర్తి చేశారు.ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఫైళ్ళకు దుమ్ము దులిపి పథకాల ప్రారంభం మొదలైంది.57 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం ప్రారంభమైంది.హుజురాబాద్ లో దళిత బందు పథకానిక బీజం పడితే మునుగోడుల ద్వారా గిరిజన బందు మొదలైంది.

చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు, కోట్ల రూపాయల నిధులు విడుదల అవ్వడం గమనించవచ్చు.అంటే ఓటు ఉంటేనే తప్ప దాని అవసరం ఏర్పడితే తప్ప ఈ ప్రభుత్వం దిగిరాదన్న నగ్న సత్యం ఈ ఎన్నికల ద్వారా రుజువు అవుతున్నది.

ఫామ్ హౌస్ ను ప్రగతి భవన్ ను వీడని ముఖ్యమంత్రి స్వయంగా ఒక గ్రామ ఇన్చార్జిగా ఎన్నికల్లో పనిచేస్తున్నారు.మంత్రివర్గమంతా మునుగోడు లోనే మకాం వేసింది.

బూత్ కు ఎమ్మెల్యే చొప్పున శాసన సభ్యులందరూ మునుగోడు గ్రామాల్లోని గల్లీలో నివాసముంటు ప్రతిరోజు ప్రజలకు దర్శనమిస్తున్నారు.నిజంగానే ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేసి ఉంటే ఇంత పెద్ద ఎత్తున యంత్రాంగమంతా మునుగోడుకు రావలసిన అవసరం ఏమున్నది.

ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం లేదు కాబట్టే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది చాప కింద నీరులా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దుబ్బాకలో హుజురాబాద్ లో వెలువడిన ఫలితాలే మునుగోడు లో కూడా ప్రస్ఫుటించే అవకాశాలు ప్రస్తుతమవుతున్నాయి.ఇది తెరాస చేసుకున్న స్వయంకృతాపరాధం తప్ప మరోటి కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube