స్మార్ట్ ఫోన్ అనేది మనిషి దైనందిత జీవితంలోని ఓ పార్ట్ అయిపోయిందంటే మీరు నమ్మితీరాలి.ఒకప్పుడు బేసిక్ ఫోన్ ఉండటమే గొప్ప అనుకుంటే, ఇపుడు ప్రతి ఇంట్లో మూడు నుండి నాలుగు స్మార్ట్ ఫోన్స్ కొలువు దీరుతున్నాయి.
ఇక యువత గురించి చెప్పాల్సిన పనిలేదు.స్మార్ట్ ఫోన్ వున్న ప్రతీ ఒక్కరూ ఫోటోగ్రాఫర్స్ అయిపోతున్నారు.
అవును, దాంతోనే వివిధ స్మార్ట్ ఫోన్ కంపెనీలు వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా కెమెరా ఫీచర్లమీద ఎక్కువ ఫోకస్ పెట్టి స్మార్ట్ ఫోన్లను రూపొందిస్తున్నాయి.
మనలో చాలా మంది కేవలం కెమెరా కోసమే ఫోన్ కొనుగోలు చేసేవారు కూడా ఉన్నారు.
అయితే ఈ విషయంలో అవగాహన లేకపోతే మాత్రం కష్టమే.అందుకే ఇపుడు ఉత్తమ కెమెరా ఫీచర్ కలిగిన టాప్ 5 స్మార్ట్‌ఫోన్ లిస్ట్‌ను ఒకసారి పరిశీలిద్దాం.
ఆపిల్ ఐఫోన్ 13 ఒకసారి చూస్తే, ప్రస్తుతం ఐఫోన్ 14 మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ.ఐఫోన్ 13 చాలా ఉత్తమం అని చెబుతున్నారు. ఐఫోన్ 13.12 మెగా పిక్సెల్స్, ఆల్ట్రా వైడ్ కెమెరాను అందిస్తోంది.తరువాత Samsung Galaxy S22, S22 Plus మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12-మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్ లెన్స్, 3X ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.ఇక దీని తరువాత Google Pixel 7 చాలా బావుంటుంది.ఈ ఫోన్ కెమెరా ఫీచర్స్ చాలా బావుంటాయి.
దీనిలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్-యాంగిల్ లెన్స్, 48-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 2-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా కలవు.ఆ తరువాత Oppo ఫైండ్ X5 ప్రో స్మార్ట్‌ఫోన్ అత్యుత్తమ కెమెరా సెటప్ కలిగి వుంది.
చివరగా Realme GT 2 ప్రో ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉత్తమంగా కలిగి వుంది.పూర్తి వివరాలకొరకు సంబంధిత వెబ్ సైట్స్ చూడగలరు.