ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో తెలంగాణకు రానున్నారు.నవంబర్ 12న పెద్దపల్లి జిల్లాలో మోదీ పర్యటించనున్నారని సమాచారం.
దీనిలో భాగంగా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించనున్నారు.ఈ నేపథ్యంలో నవంబర్ 12న మోదీ వస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
కాగా, రెండు దశాబ్దాలుకు పైగా రైతుల కష్టాలకు తెర దించేలా.తెలంగాణ రైతులకు ఎరువుల కొరత తీర్చనుంది రామగుండం ఎరువుల కార్మాగారం.
సుమారు 22 ఏళ్ల తర్వాత తొలిసారిగా రామగుండం ఎరువుల కర్మాగారం మళ్లీ ప్రారంభం అవుతుంది.గతంలో రామగుండంలోని ఎస్బీఐ ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాను స్వస్తిక్ బ్రాండ్ తో విక్రయించగా.
ప్రస్తుతం ఉత్పత్తి కానున్న యూరియాను కిసాన్ బ్రాండ్ తో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మార్కెటింగ్ చేయనుంది.