కర్ణాటక ప్రాంతం హోస్పేట్ నందు ఉన్న తుంగభద్ర జలాశయానికి జలాశయం పై ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షానికి జలాశయానికి భారీ ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతుండడంతో జలాశయనికి ఉన్న 33 గేట్లను పైకి ఎత్తుతో లక్ష యాభై వేలకి పైగా క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తుండటంతో తుంగభద్ర బోర్డు అధికారులు నాల్గవ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.
ప్రస్తుతం జలాశయం నందు నీటి నిల్వలు 1631.90 అడుగులలో 101.382 టీఎంసీల నీరు నిల్వ ఉంది.జలాశయానికి ఇన్ఫ్లోగా 1,39,909 క్యూసెక్కుల నీరు, అవుట్ ఫ్లోగా 1,64,616 క్యూసెక్కుల నీటిని 33 గేట్లలో 25 గేట్లను మూడున్నర అడుగుల మేర, 8 గేట్లను ఒకటిన్నర అడుగు మేర పైకెత్తుతూ వరద నీటిని విడుదల చేస్తుండడంతో నాలుగవ ప్రమాద హెచ్చరికలనుజారీ చేయడం జరిగింది.అదేవిధంగా నది తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండటమే కాక నదిలోకి ఎవరు వెళ్ళకూడదని హెచ్చరిస్తున్నారు…
.