అమరావతి ఆర్-5 జోన్ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఆర్ -5 జోన్ లో ఇళ్ల నిర్మాణాలను నిలిపివేయాలంటూ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.కాగా ఇప్పటికే ఈ కేసులో తమ వాదనలు వినకుండా ధర్మాసనం తీర్పును వెలువరించ వద్దని కోరుతూ అమరావతి రైతులు కేవియట్ దాఖలు చేశారు.
ఈ మేరకు ఈ పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.