కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచదేశాల్లోనూ అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన ప్రాణాంతక కరోనా వైరస్.
ఇప్పటికే లక్షల మంది ప్రాణాలను బలితీసుకుంది.కరోనా పుట్టి ఎనిమిది నెలలు గడుస్తున్నా.
ఈ మహమ్మారి జోరు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.అయితే కరోనాను రక్షించుకోవాలంటే.
శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచే ఆహారం తీసుకోవాలని ఎప్పటికప్పుడు నిపుణులు సూచిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఖచ్చితంగా మునగాకు తినాల్సిందే.
ఎందుకంటే.వివిధ రకాల వ్యాధులతో పోరాడే రోగ నిరోధక శక్తి పెంచడంలో మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది.
అంతేగాక ఈ వర్షాకాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గులాంటి సమస్య నుంచి మునగాకు రక్షిస్తుంది.అందుకే ఖచ్చితంగా మునగాకు డైట్‌లో చేర్చుకోమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇక మునగాకుతో మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి…
అధిక రక్తపోటును కంట్రోల్ చేయడంతో మునగాకు సహాయపడుతుంది.ఒక గుప్పెడు మునగాకును వేడినీళ్ళలో నానబెట్టి.అరగంట తర్వాత ఆ నీటిని తీసుకోవాలి.ఇలా చేస్తే.క్రమంగా రక్తపోటు అదుపులోకి వస్తుంది.అలాగే మధుమేహం సమస్యతో బాధపడేవారు.
తప్పకుండా మునగాకు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.
ఎందుకంటే.
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేసే శక్తి మునగాకు ఉంది.ఇక మునగాకులో ఎన్నో ఎమినో యాసిడ్స్, విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి గుండె ఆరోగ్యాకిని మేలు చేస్తుంది.థైరాయిడ్ సమస్యను నివారిస్తుంది.
అలాగే మునగాకులో ఉండే విటమిన్- ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.సో.ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకును తప్పకుండా మీ డైట్‌లో చేర్చుకోండి.