ఈ మధ్య కాలంలో చాలా మంది బరువు తగ్గడం కోసం ఓట్స్‌ను డైట్‌లో చేర్చుకుంటున్నారు.ఆరోగ్యకరమైన ధాన్యాలలో ఓట్స్ ఒకటి.
విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఓట్స్‌లో పుష్కలంగా నిండి ఉంటాయి.బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి, గుండె జబ్బులకు అడ్డు కట్ట వేయడానికి ఓట్స్ బాగా సహాయ పడతాయి.
అందుకే డైటీషియన్స్ కూడా ఓట్స్‌ను ప్రిఫర్ చేస్తుంటారు.దీంతో చాలా మంది ప్రతి రోజు ఓట్స్ రెసిపీలనే తింటుంటారు.
అయితే ఓట్స్ మాత్రమే కాదు.ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను తీసుకున్నా మరింత వేగంగా వెయిట్ లాస్ అవ్వొచ్చు.
మరి లేట్ చేయకుండా ఆ ఫుడ్స్ ఏవేవో ఓ లుక్కేసేయండి.
పూల్ మఖానా.
వీటినే తామర గింజలు అని పిలుస్తుంటారు.వెయిట్ లాస్‌కు ఇవి సూపర్‌గా హెల్ప్ చేస్తుంటాయి.
మఖానా ఖీర్, మఖానా జావా, మింట్ మఖానా వంటి రెసిపీలను తీసుకుంటే గనుక బరువు తగ్గుతారు.
వేగంగా బరువు తగ్గడానికి రాగులు కూడా అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో రాగి జావ తీసుకుంటే శరీరంలో కొవ్వు కరుగుతుంది.అదే సమయంలో అతి ఆకలి తగ్గి.
చిరుతిండ్లపై మనసు మల్లకుండా ఉంటుంది.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.
చాలా మంది జొన్నలను పెద్దగా పట్టించుకోరు.కానీ, ఓట్స్ కంటే ఫాస్ట్‌గా జొన్నలే బరువును తగ్గిస్తాయి.
జొన్నలతో తయారు చేసిన కిచిడి, జొన్న రొట్టెలు తీసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది.అలాగే గోధుమ రవ్వ ఉప్మా, పోహ ఉప్మా, కివి బెర్రీ స్మూతీ, వెజిటబుల్ సూప్, టొమాటో పాస్తా వంటి వాటని కూడా తీసుకోవచ్చు.
ఈ ఫుడ్స్ సైతం బరువు తగ్గడానికి ఉత్తమంగా సహాయపడతాయి.కాబట్టి, ఎప్పుడూ ఓట్సే కాకుండా వీటిని కూడా తీసుకునేందుకు ప్రయత్నిస్తే మంచిది.
.