పేదోళ్లను రెస్టారెంట్‌కి తీసుకెళ్లి భోజనం తినిపించాడు.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న చిన్నారులు..

సాధారణంగా పేదవారు మూడు పూటలా ఆహారం లభించక అర్ధాకలితోనే నిద్రపోతుంటారు.హాయిగా పెద్ద రెస్టారెంట్ కి వెళ్లి కడుపునిండా భోజనం చేయాలని వారికి ఉంటుంది కానీ అందుకు డబ్బులు లేక కలలను, ఆకలిని చంపకుంటారు.

 He Took The Poor People To The Restaurant And Fed Them The Children Shed Tears O-TeluguStop.com

ముఖ్యంగా పేదరికంలో పుట్టిన చిన్న పిల్లలు పడే బాధ వర్ణనాతీతం.అయితే ఒక్క పూటైనా అలాంటి పేద పిల్లల జీవితంలో వెలుగులు నింపాలని ఒక యువకుడు తలచాడు.

అనుకున్నదే తడువుగా సదరు వ్యక్తి ఓ పేద కుటుంబాన్ని ఓ ఖరీదైన రెస్టారెంట్‌కు తీసుకెళ్లి వారు కోరినవన్నీ తినిపించాడు.ఈ హార్ట్ టచింగ్ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వ్యక్తి తమకు ఏం కావాలంటే ఆ ఫుడ్ ఐటమ్స్( food items ) పెట్టించడం చూసి పేద కుటుంబంలోని పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు.ఒక అమ్మాయి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది.ఆషిక్ ( Ashik )అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో @abrokecollegekid అనే పేజీలో వీడియోను పంచుకోగా అది చూసి నెటిజన్లు బాగా ఎమోషనల్ అవుతున్నారు.వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే, ఒక నిరుపేద కుటుంబం రెస్టారెంట్‌లో కూర్చొని ఉండటం మనం గమనించవచ్చు.

యువకుడు వారికి ఏమేం కావాలో అడిగి మసాలా దోస, ఫ్రైడ్ రైస్, పనీర్ బిర్యానీ వంటి ఐటమ్స్ ఆర్డర్ ఇవ్వడం చూడవచ్చు.

ఆ కుటుంబంలో ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు, వారందరికీ కడుపు నిండేలా ఇతడు ఫుడ్ పెట్టించాడు.ఆ దృశ్యం చూస్తే ఎవరికైనా సరే గుండె తరుక్కుపోతుంది, ఎన్నడూ తినని మంచి టేస్టీ ఫుడ్ పెట్టించడంతో ఒక బాలిక తన ఆనందాన్ని అదుపు చేసుకోలేక కంటతడి పెట్టుకుంది.ఎందుకు ఏడుస్తున్నావ్ తిను అని యువకుడు అనడం కూడా మనం చూడవచ్చు.

ఈ వీడియో చాలా మంది హృదయాలను టచ్ చేసింది.దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube