హైదరాబాద్‌లో హవాలా దందా ఆగడం లేదు.వరుస పెట్టి భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది.
మొన్న, నిన్న మాత్రమే కాదు.ఇవాళ కూడా భారీ మొత్తంలో హవాలా నగదు పట్టుబడి.బంజారాహిల్స్‌లో రూ.2 కోట్లు సీజ్ చేశారు అధికారులు.బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో టాస్స్‌ఫోర్స్ అధికారులు ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.ఇక నిన్న, మొన్న జూబ్లీహిల్స్ వెంకటగిరిలో రూ.54 లక్షలు, చాంద్రాయణగుట్టలో రూ.79 లక్షలు, జూబ్లీహిల్స్‌లో రూ.2.5 కోట్లు పట్టుబడింది.అయితే, వారం రోజుల వ్యవధిలోనే సుమారు 8 కోట్లకు పైగా హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకోవటం చర్చనీయాంశం అయింది.పెద్దఎత్తున తరలిస్తోన్న ఈ సొమ్ము ఎవరి ఆదేశాలతో తరలిస్తున్నారు.
ఎవరికి అందజేయడానికి తీసుకెళ్తున్నారనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.