స్వీట్లకు భారతదేశంలో చాలా ప్రత్యేక స్థానం వుంది. స్వీట్లను ఇక్కడ చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా ఆరగిస్తూ వుంటారు.
వివిధ ప్రాంతాలను బట్టి ఇక్కడ ఒక్కో స్వీట్ ఫేమస్ అయి ఉంటుంది.కాకినాడ కాజా, బందరు లడ్డు, తాపేశ్వరం పూతరేకులు ఇలా అనేక రూపాల్లో స్వీట్స్ మనకు ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటాయి.
ఆయా రుచులను చూసేందుకు ఆహారప్రియులు ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధమవుతుంటారు.ఇక ప్రతి చిన్న సంబరంలో కూడా ఈ స్వీట్ అనేది భాగం అయిపోతుంది.
స్వీట్ లేని భోజనం ఇక్కడ పరిపూర్ణం కాదు.ఇక మిఠాయిలన్నింటిలో జిలేబీకి చాలా ప్రత్యేకత స్థానం ఉంది.వివాహమైనా లేదా మరే ఇతర సంబరమైనా జిలేబీ తప్పకుండా ఇక్కడ దర్శనం ఇస్తుంది.యూపీలోని లక్నోలోని ఓ స్వీట్ షాప్ వినూత్న రీతిలో జిలేబీ తయారు చేసి, స్థానికులను అబ్బురపరిచింది.
షాప్‌లోని స్వీట్ మేకర్ అతిపెద్ద జిలేబీని తయారు చేయగా ఈ జిలేబీని చూసినవారంతా తెగ మురిసిపోతూ అతగాడిని ఆకాశానికెత్తేస్తున్నారు.
అవును, లక్నోకు చెందిన ఒక ఫుడ్ బ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ‘ఈట్‌విత్‌సిడ్’లో ఈ జిలేబీ వీడియోను షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.కాగా జిలేబీ పరిమాణం సాధారణ పరిమాణం కంటే ఎంతో పెద్దగా ఉంది.చాలా మంది దీనిని ‘ప్రపంచంలోనే అతిపెద్ద జిలేబీ’ అని పేర్కోవడం విశేషం.రూ.360 ధరకు లభించే ఈ జిలేబీ ఉదయం 8 నుండి 11 గంటల మధ్య అందుబాటులో ఉంటుందని షాపు నిర్వాహకులు చెబుతున్నారు.కాగా వీడియో చూసిన ఒక ఒక వినియోగదారుడు “ఇంత పెద్ద జిలేబీని డైనోసార్ మాత్రమే తినగలుగుతుంది” అని సరదాగా కామెంట్ చేయడం విశేషం.