2 రోజుల్లోనే రూ.3 వేల కోట్లు సంపాదించిన ఎన్నారై.. అదానీ పుణ్యమే!

అదానీ గ్రూప్ షేర్ల విలువ వరుసగా మూడవ రోజు పెరిగింది, ఫలితంగా రెండు రోజుల్లో ఒక ఇన్వెస్టర్‌కి సుమారు రూ.3,000 కోట్ల లాభం వచ్చింది.యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వల్ల అదానీ గ్రూప్ షేర్లలో గణనీయమైన క్షీణత కనిపించింది.మళ్లీ నెల తర్వాత ఈ గ్రూపు షేర్ల విలువ పెరుగుతోంది.గత వారం, నాలుగు అదానీ గ్రూప్ స్టాక్‌లలో రూ.15,446 కోట్ల బ్లాక్ డీల్ చేసిన ఆరేళ్ల నాటి ఇన్వెస్ట్‌మెంట్ బోటిక్ సంచలనం సృష్టించింది.

 Gqg Founder Nri Rajiv Jain 15k Crores Investments In Adani Group Details, Nri Ne-TeluguStop.com

ఇక అసలు విషయానికి వస్తే GQG పార్టనర్స్ వ్యవస్థాపకుడు, ఎన్నారై రాజీవ్ జైన్ రెండు రోజుల్లో 20% కంటే ఎక్కువ రాబడిని సంపాదించి, గురువారం నుంచి రూ.3,102 కోట్ల లాభాన్ని సంపాదించారు.ప్రస్తుతం అతని పెట్టుబడి విలువ రూ.18,548 కోట్లుగా ఉంది.అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌ స్టాక్‌లలో జైన్ ఇన్వెస్ట్ చేయగా వాటి మార్కెట్ విలువ రూ.18,548 కోట్లకు చేరుకుంది.దాంతో పైన చెప్పిన విధంగా రూ.3,000 కోట్లకు పైగా అతడు లాభాలు సంపాదించారు.

Telugu Crore, Adani, Gqgfounder, India, Nri, Nri Profits, Nri Rajiv Jain-Telugu

బ్లాక్ డీల్‌లో జైన్ గురువారం రూ.1,410.86 ధరతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లను కొనుగోలు చేశారు.అప్పటి నుండి, స్టాక్ ధర 33% పెరిగింది.ఫలితంగా నిఫ్టీ స్టాక్‌లో అతనికి రూ.1,813 కోట్ల లాభం వచ్చింది.ఇకపోతే అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (APSEZ), అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (AGEL), అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ (ATL), అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL) షేర్లను సెకండరీ మార్కెట్ బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది.ఈ డీల్స్ ద్వారా కొనుగోలు చేసిన వారికి మంచి లాభాలు దక్కాయి.

Telugu Crore, Adani, Gqgfounder, India, Nri, Nri Profits, Nri Rajiv Jain-Telugu

ఇదిలా ఉండగా రాజీవ్ జైన్ పెట్టుబడి GQGని భారతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో చాలా ముఖ్యంగా మార్చిందని అదానీ గ్రూప్ అధికారిక ప్రకటనలో తెలిపింది.కాగా ఈ డీల్ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది.గౌతమ్ అదానీ ప్రధాన అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు గత ఐదు రోజుల్లో దాదాపు 17% పెరిగి BSEలో రూ.1,879.35 వద్ద స్థిరపడ్డాయి.అదానీ పోర్ట్స్ స్టాక్స్ 9.81% ర్యాలీ చేయగా, అంబుజా సిమెంట్స్ 5.70%, ఏసీసీ 5.11% పెరిగాయి.అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్ అన్నీ 5% లాభపడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube