అవును, మీరు విన్నది నిజమే.దాదాపు 10 పోకో స్మార్ట్ ఫోన్లకు ఎంఐయూఐ 14 (MIUI 14) అప్‍డేట్ విషయాన్ని ఆ కంపెనీ తాజాగా వెల్లడించింది.
ఎప్పుడు ఏ ఫోన్‍కు అప్‍డేట్ రోల్అవుట్ చేయనున్నది అనే విషయమై టైమ్‍లైన్ చేసి మరీ చెప్పింది. షావోమీ 13 ప్రో 5జీ మొబైల్‍తో పాటు గత నెల లేటెస్ట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ‘ఎంఐయూఐ 14’ను ఇండియాలో లాంచ్ చేసిన షావోమీ తాజాగా కొన్ని మార్పులతో ఎంఐయూఐ 14ను తీసుకొచ్చింది.
తాజాగా పోకో ఫోన్‍లకు సంబంధించిన వివరాలను ప్రకటించింది.
తాజాగా లాంచ్ చేసిన పోకో ఎక్స్5 ప్రో 5జీ ఫోన్ ఈ ఏడాది తొలి క్వార్టర్ అంటే తొలి మూడు నెలల్లో ఎంఐయూఐ 14 అప్‍డేట్‍ను అందుకున్న విషయం తెలిసినదే.అదే విధంగా రెండో క్వార్టర్‌లో అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య పోకో ఎక్స్3 ప్రో, పోకో ఎఫ్4 5జీ, పోకో ఎఫ్3 జీటీ, పోకో సీ55, పోకో ఎం5, పోకో ఎం4 5జీ మొబైళ్లు ఎంఐయూఐ 14 అప్‍డేట్‍ను పొందనున్నాయి.అలాగే ఈ ఏడాది మూడో త్రైమాసికంలో పోకో ఎక్స్4 ప్రో 5జీ, పోకో ఎం4 ప్రో 5జీ, పోకో ఎం4 5జీ ఫోన్లకు ఎంఐయూఐ 14 అప్‍డేట్ రోల్అవుట్ అవుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
ఇక ఎంఐయూఐ 14 ఫీచర్ల విషయానికొస్తే… ఎంఐయూఐ 13తో పోలిస్తే ఇది లైట్‍వెయిట్ యూఐ స్కిన్‍తో వస్తుంది.డిజైన్ పరంగా చూస్తే 14లో చాలా మార్పులు ఉంటాయి.హోమ్ స్క్రీన్‍ను మరింత కస్టమైజ్ చేసుకోవచ్చు.ఇందులో ఐకాన్స్ ఫోల్డర్ సైజ్‍లను కూడా సెట్ చేసుకోవచ్చు.కొత్త సెక్యూరిటీ ఫీచర్లు, కెెమెరా ఫీచర్లు అనేవి ఎంఐయూఐ 14కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.షావోమీ, రెడ్‍మీ ఫోన్లు మోడల్‍ను బట్టి ఆయా సమయాల్లో ఆ ఫోన్‍లకు కొత్త వెర్షన్ రోల్అవుట్ చేస్తూ వస్తుంది.