ఖమ్మం కాంగ్రెస్ సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఇందులో భాగంగానే బస్సులు ఇవ్వొద్దని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు.
డిపోల నుంచి 1500 బస్సులు కోరితే మొదట ఇస్తామన్నారన్న పొంగులేటి ఇప్పుడు ఆర్టీసీ అధికారులు మాట మార్చారని మండిపడ్డారు.సభకు కార్యకర్తలు సొంత వాహనాలపై రావడానికి సిద్ధపడ్డారని తెలిపారు.
ఖమ్మం సభను విఫలం చేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోందన్నారు.ఈ క్రమంలోనే సభకు పది కిలోమీటర్ల దూరంలో చెక్ పోస్టులు పెట్టి అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.
ఖమ్మం సభ జరిగే రోజు మంచినీటి సరఫరా లేకుండా కుట్ర చేస్తున్నారన్నారు.రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు వచ్చే వారు టెర్రరిస్టులు కాదన్నారు.
బీఆర్ఎస్ సభను తలదన్నేలా కాంగ్రెస్ సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.