వచ్చే ఎన్నికల్లో ఎన్నారైలు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు అందుకోసం కేంద్రం అన్ని విధాలుగా ఆలోచనలు చేసింది అందుకు తగ్గట్టుగా ఒక బిల్లుని కూడా రూపొందించింది.ఈ క్రమంలోనే ఉపాది నిమ్మిత్తం విదేశాలకి వెళ్ళిన వారు ఓటు హక్కు వినియోగించుకునేలా పరోక్ష ఓటు హక్కు విధానానికి నాంది పలకనుంది.
దీనినే “ప్రాక్సీ ఓటింగ్” విధానం అనికూడా అంటారు.ఈ మేరకు ప్రజా సవరణ బిల్లు-2017ను లోక్సభ ఇటీవల ఆమోదించింది.
రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్ట సవరణ అమల్లోకి వస్తుంది.
ఇదిలాఉంటే ఇప్పటికిప్పుడు ప్రవాసీయులపై ఎందుకంత ప్రేమ అంటే కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే దాదాపు 40 లక్షల మంది ఎన్నారై ఓటర్లు ఉన్నారు అంటే అది మామూలు విషయం కాదు ఈ 40 లక్షలలో కూడా కేవలం ఏపీ నుంచీ 22 లక్షల మంది ఓటర్లు ఉన్నారట.అయితే వీరందరూ ఎన్నికల సమయంలో వచ్చినా సరే లేదంటే తమ ప్రతినిధుల ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నా సరే సరిపోతుందట.
అయితే ఇప్పుడు ముందస్తు ఊపు కొనసాగుతున్న తరుణంలో అన్ని పార్టీలకి ఎన్నారైల ఓట్లు కీలకం కానున్నాయి అంటున్నారు.వారిని దృష్టిలో పెట్టుకుని వారిపై వారాల జల్లు కురిపించనున్నారు రాజకీయ పార్టీ అధినేతలు.ఇక్కడ మరొక విషయం ఏమిటంటే గల్ఫ్ వెళ్ళిన వారిని ఇప్పటివరకూ ఏ అధికార పార్టీ పట్టించుకున్న పాపాన లేదు దాంతో వీరిని ఎలా బుజ్జగిస్తారో వేచి చూడాలి.
అంతేకాదు కొన్ని నియోజకవర్గాల గెలుపు ఓటములు చాలా మంది ఎన్నారైలపై ఆధారపడి ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు.