సూర్య,విజయ్,కమల్ హాసన్ తమిళ నటులు అయ్యుండి డబ్బింగ్ సినిమాలు,స్ట్రెయిట్ ఫార్వర్డ్ మూవీస్ చేసి మన తెలుగులో వారికంటూ ఒక ముద్ర వేసుకున్నారు.మరి మన తెలుగు వాళ్లు అయ్యుండి ఇతర పరిశ్రమల్లో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నవారు కొందరున్నారు.
వారెవరు.ఏ సినిమా పరిశ్రమల్లో ఉన్నారు.మీ కోసం.
విశాల్
తమిళ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విశాల్ వాస్తవానికి తెలుగు వాడు.ప్రముఖ నిర్మాత జికె రెడ్డి కుమారుడు.ఇక్కడ సెల్యూట్ సినిమాతో పరిచయం అయిన విశాల్ ఆ తర్వాత తమిళ సినిమాలపై దృష్టిపెట్టి స్టార్ గా ఎదిగాడు.ఇప్పుడు అక్కడ రాజకీయాలు,సామాజిక కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు.
సాయికుమార్
కనిపించే ఈ నాలుగు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనపడని నాలుగో సింహమేరా పోలీస్… పాతికేళ్లైనా డైలాగ్ లో పవర్ తగ్గలేదు కదా.తెలుగు వాడైన సాయికుమార్ కన్నడలో పెద్ద యాక్టర్ గా పేరుతెచ్చుకున్నారు.
సమీరా రెడ్డి
సమీరా రెడ్డి పేరు వినగానే ఎవరైనా బాలివుడ్ హీరోయిన్ అనుకుంటారు.కాని మన రాజమండ్రిలో పుట్టిపెరిగిన అమ్మాయి.మొదటి సినిమా తెలుగులో నరసింహుడు.తర్వాత కొన్ిన సినిమాలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు.
శ్రీదేవి
అతిలోక సుందరి శ్రీదేవి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు కదా.రెండు తరాల నటులతో నటించడమే కాదు.టాలివుడ్ నుండి బాలివుడ్ కి వెళ్లి అక్కడ కూడా ప్రేక్షకుల మతులు పోగొట్టింది.
చివరికి బోణి కపూర్ ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోయింది.ఇప్పుడు తన కూతుర్నికూడా బాలివుడ్ నుండే ఇంట్రడ్యూస్ చేస్తుంది.
రేఖ
బాలివుడ్ మోస్ట్ ఫేవరెట్ యాక్ట్రెస్ రేఖ.మన తెలుగు సినిమా రంగులరాట్నంలో చైల్డ్ ఆఱ్టిస్ట్ గా చేసింది.రేఖ వాళ్ల అమ్మ పుష్పవల్లి తెలుగు సినిమా నటి.కాకపోతే తెలుగు అమ్మాయిగా కన్నా బాలివుడ్ భామగానే రేఖకు ఎక్కువ గుర్తింపు వచ్చింది.
శ్రీరామ్
శ్రీకాంత్ అంటే ఎవరు గుర్తు పట్టరు కానీ.శ్రీరామ్ అనగానేటక్కున గుర్తొస్తాడు.
ఒకరికి ఒకరు సినిమాతో పరిచయం అయిన శ్రీరామ్.తర్వాత తెలుగులో ఒకట్రెండు సినిమాలు చేసాడు.
వాటిల్లో ఆడవారి మాటలకు అర్దాలే వేరులే… తమిల్ లో మాత్రం శ్రీరామ్ పెద్ద యాక్టర్…
జీవా
ఆర్బి చౌదరి గారు తెలుగులో ఎన్నో సినిమాలను నిర్మించారు వారి అబ్బాయే అమర్ చౌదరి.ఇలా చెప్తే మీకు తెలీదు జీవా.తమిల్లో పెద్ద స్టార్ అంతే కాదు ఎన్నో హిట్స్ జీవా ఖాతాలో ఉన్నాయి.
ఆది పినిశెట్టి
ఒక విచిత్రంతో పరిచయం అయినప్పటికి సరైన గుర్తింపు రాలేదు ఆదికి.తర్వాత తమిళ్ పరిశ్రమలో తన అదృష్టం పరిక్షించుకున్నాడు.ఇప్పుడు స్టైలిష్ విలన్ గా నటిస్తూ తెలుగులోనూ దూసుకుపోతున్నాడు.
.