ఆడవాళ్లకు శుభవార్త.. రూ.1కే పట్టుచీరని సొంతం చేసుకోండి?

“చీరలోని గొప్పతనం తెలుసుకో.ఆ చీరకట్టి ఆడతనం పెంచుకో” అని మన తెలుగు సినీ కవులు ఊరికే చెప్పలేదు.

 Good News For Women Own A Silk Saree For Rs.1, Good News , One Rupee, Viral Late-TeluguStop.com

చీరలు మగువలకు ఆభరణాలు వంటివి.ఇంకే డ్రెస్ లోను లేని అందం వారు చీరకట్టుకుంటే వస్తుంది అని అందరికీ తెలిసిందే.

ఓ మగాడు తనకి ఇష్టమైన అమ్మాయిని చీరలోనే చూడాలని ఆశపడతాడు.ఇక మన ఆడాళ్ళు ఇంట్లో ఎన్ని చీరలు ఉన్నాసరే, సందర్భం వచ్చినప్పుడల్లా కొత్తమోడల్స్ చీరలు కొనడానికి ఆసక్తి చూపుతారు.

అంతే కాకుండా అషాడం, శ్రావణమాసం కోసం ముందే డబ్బులు కూడబెట్టుకుని కేజీసేల్‌లో తెచ్చుకుంటారు.

ఈ క్రమంలో వారు ఎక్కడ ఆఫర్ ఉంటే అక్కడ క్షణాల్లో వాలిపోతారు.

ఇక అలాంటి సందర్భాలలో వారితోపాటు షాపింగ్ కి వెళ్లిన మగాళ్ళకి చుక్కలు కనిపిస్తాయి.అలాంటిది ఇక రూపాయికే పట్టు చీర అంటే ఊరుకుంటారా? ఎగబడిపోయి మరీ కొనేస్తారు.సరిగ్గా తమిళనాడులో ఇలాంటి సంఘటనే జరిగింది.ఓ షాప్ వారు రుపాయికే పట్టు చీర అనే ఆఫర్ పెట్టారు.దీంతో జనమంత చీరల కోసం క్యూ కట్టారు.దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Telugu Rupee, Srivenkateswara, Latest-Latest News - Telugu

తమిళనాడులోని క్రిష్ణగిరికి చెందిన శ్రీ వెంకటేశ్వర సిల్క్స్‌ షోరూం వారు, వార్షికోత్సవం సందర్భంగా రూపాయకే పట్టు చీర అనే ఆఫర్ ప్రకటించారు.అంతే కాకుండా ఆటో డ్రైవర్లకు ఉచితంగానే పట్టు చీర ఇవ్వనున్నాము, చాలా ఆఫర్స్ మా షాప్‌లో ఉన్నాయంటూ బ్యానర్లు ఏర్పాటు చేసింది.ఇక ఈ విషయం తెలుసుకున్న జనం ఉదయాన్నే షాపు ముందు క్యూ కట్టారు, ఆటో డ్రైవర్లు సైతం తమ పనిని పక్కకు పెట్టి, చీరలు తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు.దీంతో షాపు జనాలతో కిక్కిరిసిపోయింది.

తోసుకుంటూ షాప్‌లోపలికి వెళ్లడానికి ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో చాలా మందికి గాయాలుకాగా, వాటిని పక్కకు పెట్టి మరీ చీరలు కొనడానికి షాప్‌లోకి వెళ్లిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube