హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు విషయంపై మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ పేరు తొలగింపులో ఎటువంటి రాజకీయ ఆలోచన లేదన్నారు.
ఆరోగ్య శ్రీ అంటే మొదట గుర్తొచ్చే పేరు వైఎస్ఆర్ అన్న ఆయన.పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించిన గొప్ప మహానీయుడని కొనియాడారు.అందుకూ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టామన్నారు.అదేవిధంగా గతంలో బీసీలను చంద్రబాబు ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకున్నారని ఆరోపించారు.జగన్ సీఎం అయ్యాక బీసీలకు పెద్ద పీట వేశారని తెలిపారు.