Ninja 650 updated version : బైక్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. ఇండియాలో నింజా 650 అప్‌డేటెడ్ వెర్షన్ లాంచ్.. ధర, ఫీచర్లివే..

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ కవసాకీ ఇండియాలో అప్‌డేటెడ్ 2023 నింజా 650 స్పోర్ట్స్ బైక్‌ని తాజాగా రిలీజ్ చేసింది.దీని ధరను రూ.7.12 లక్షలు (ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది.కాగా నింజా 650 2023 వెర్షన్‌లో కొత్తగా ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను అందించారు.ఇందులో అందించిన ట్రాక్షన్ కంట్రోల్ మోడ్ 1లో ట్రాక్షన్ కంట్రోల్ సెటప్ కాస్త ఆలస్యంగా వినియోగంలోకి వస్తుంది.

 Good News For Bike Lovers Ninja 650 Updated Version Launched In India.. Price, F-TeluguStop.com

మోడ్ 2లో మాత్రం మిల్లిసెకన్లలో ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అవుతుంది.ఈ సిస్టమ్‌ను పూర్తిగా ఆఫ్ కూడా చేయవచ్చు.2023 కవసాకీ నింజా 650 లైమ్ గ్రీన్ అనే ఒకే కలర్ ఆప్షన్‌లో అందుబాటులోకి వచ్చింది.ఈ బైక్ డెలివరీలు ఈ నెల నుంచే ప్రారంభమవుతాయి.

ఈ ఫీచర్ తప్పించి సరికొత్త నింజా 650 మెకానికల్‌గా పెద్దగా మార్పులను పొందలేదు.ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వల్లే ఇది రూ.51,000 ఎక్కువ ధరతో వస్తోంది.2023 నింజా 650లో 649 సీసీ, 180-డిగ్రీల ప్యారాలెల్-ట్విన్ ఇంజన్‌తో 8,000 ఆర్‌పీఎమ్ వద్ద 68 హెచ్‌పీ.6700 ఆర్‌పీఎమ్ వద్ద 64 Nm గరిష్ఠ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.దీనిలో స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఆఫర్ చేశారు.

Telugu Ninja, India Launch, Kawasaki-Latest News - Telugu

ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, బ్యాక్‌ సైడ్ ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ మోనో-షాక్ అబ్సర్వ్‌ర్ ఇచ్చారు.అలానే ఫ్రంట్ సైడ్ ట్విన్-పిస్టన్ కాలిపర్‌లతో కూడిన ట్విన్ 300ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్‌లు.బ్యాక్‌ సైడ్ ఒకే పిస్టన్ కాలిపర్‌తో ఒకే 220 మిమీ డిస్క్ బ్రేక్‌ ఆఫర్ చేశారు.కొత్తగా అందుబాటులో ఉన్న ట్రాక్షన్ కంట్రోల్‌తో పాటుగా డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ అనేది స్టాండర్డ్‌ వెర్షన్‌లోనే అందుబాటులో ఉంది.డన్‌లప్ స్పోర్ట్‌మ్యాక్స్‌ రోడ్‌స్పోర్ట్ 2 టైర్లు దీనిలో ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube