వైసీపీలో మహిళా ఫైర్ బ్రాండ్ ఎవరంటే టక్కున ఆర్కే రోజా( Minister Roja ) పేరే చెబుతారు ఎవరానైనా.ప్రత్యర్థి పార్టీ నేతలపై ఘాటైన విమర్శలు గుప్పిస్తూ, పోలిటికల్ హీట్ పెంచుతుంటారు రోజా.2014,2019 ఎన్నికల్లో నగరి బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో కీలక మహిళా నాయకురాలుగా ఉన్నారు.కాగా వైసీపీలో కీ రోల్ పోషించే రోజా మొత్తం మీద రాజకీయాలకే గుడ్ బై చెప్పబుతున్నారా ? ఈసారి ఎన్నికల బరిలో నిలవడం కష్టమేనా ? అసలు రోజా నెక్స్ట్ ఏం చేయబోతుంది ? అనే ప్రశ్నలు హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి.
ఎందుకంటే ఈ రోజా వైసీపీకి దూరంగా ఉంటున్నారని మొత్తం మీద అయే ఏపీ రాజకీయాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.ఈ రకమైన వార్తలు రావడానికి కూడా కారణం లేకపోలేదు.ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న నగరి నియోజిక వర్గంలో గత కొన్నాళ్లుగా వర్గ పోరు నడుస్తోంది.సొంత పార్టీ నేతలే రోజాకు వ్యతిరేకంగా పావులు కడుపుతున్నారు.ఈ విషయాలను స్వయంగా రోజానే పలుమార్లు చెప్పుకొచ్చారు కూడా.ఇవే కాకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి( Peddireddy Ramachandra Reddy ) తో కూడా రోజాకు విభేదాలు ఉన్నాయి.
దీంతో ఆమె పాత్రను వైసీపీలో తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.అంతే కాకుండా నగరి నియోజిక వర్గంలో కూడా రోజాపై ప్రజావ్యతిరేకత ఉన్నట్లు సర్వేలు చెబుతుండడంతో జగన్ కూడా రోజా దూరం పెడుతున్నట్లు టాక్.ఈసారి నగరి టికెట్ కూడా రోజాకు దక్కడం కష్టమే అనే వాదన కూడా వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఆమె ఏపీ రాజకీయాలకు గుడ్ బై చెప్పి తమిళ రాజకీయాలపై దృష్టి సారించాలని చూస్తున్నారట.
తమిళ్ నాడులో డీఎంకే( DMK ) తరుపున పోటీ చేసే ఆలోచనలో రోజా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో వినికిడి.మరి వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరుకు నిజం ఉందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.