దుబాయ్‌లో జరిగిన ఒక పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఎందుకంటే ఈ పెళ్లిలో వధువు బరువుకి సమానమైన బంగారాన్ని తల్లిదండ్రులు వరుడికి అందించారు.
దీన్ని బట్టి వీరు ఎంత ధనవంతులో అర్థం చేసుకోవచ్చు.నిజానికి ఈ నవ దంపతులు పాకిస్థాన్‌కు చెందినవారు.
కానీ దుబాయ్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు.
భారతదేశంతో పాటు అనేక ఇతర దేశాలలో, పెళ్లిళ్లలో బంగారు కొనుగోలు చేయడం ఆచారంగా వస్తోంది.ఈ బంగారం ధరించి అత్యంత ఆకర్షణీయంగా వధూవరులు కనిపిస్తుంటారు.బంగారం అనేది చాలా తక్కువగానే కొంటారు.
ఎందుకంటే వీటి రేట్ చాలా ఎక్కువ.అయితే దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకలో పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుమార్తె శరీర బరువుకు సరిసమానమైన బంగారాన్ని తూకం వేయించి ఆ బంగారమంతా వరుడుకి అందజేశాడు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
వీడియో ప్రకారం, వధువును తూకం వేసే కాటాలో ఒకవైపు కూర్చోబెట్టారు, మరోవైపు ఆమె బరువును సమం చేయడానికి పెద్ద బంగారు ఇటుకలు ఉన్నాయి.వధువు కట్నంలో ఒక భాగమని ఆమె అత్తమామలకు ఈ బంగారాన్ని అందించిందట.నిజానికి పాకిస్తాన్ ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో అల్లడంతోంది.
అలాంటిది ఇంత గ్రాండ్‌గా పెళ్లి జరిపించాలని కొందరు కామెంట్ చేస్తున్నారు.మరికొందరు వామ్మో ఇలాంటి సీనే తాము ఎక్కడా చూడలేదని కామెంట్ చేస్తున్నారు.
ఇలాంటి సీను సినిమాల్లో తప్ప వేరే చోట కనిపించదు అనుకున్నాం కానీ ఆ ముచ్చట కూడా మీరు తీర్చేసారని ఇంకొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.