గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ నియామకం ఎట్టకేలకు పూర్తి అయింది.ఈ మేరకు బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా బేగంబజార్ కు చెందిన శంకర్ యాదవ్ నియామకం అయ్యారు.
దాదాపు రెండేళ్ల తర్వాత బీజేపీ ఫ్లోర్ లీడర్ నియామకం జరిగిన విషయం తెలిసిందే.ఫ్లోర్ లీడర్ నియామకంతో పాటు డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా రాధా ధీరజ్ రెడ్డి, నరసింహా రెడ్డి, సురేఖ ఓం ప్రకాశ్ లు హాజరు అయ్యారు.
కాగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు బీజేపీకి ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరుతో కొనసాగిందన్న వార్తలు వినిపించాయి.అంతేకాకుండా ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో కనీసం తమ గొంతు వినిపించడానికి కూడా సరైన అవకాశం లేకుండా పోతోందని బీజేపీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.