వైరల్‌ : బికినీలో వస్తే ఫ్రీ అన్నారు, అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ వచ్చారు

కంపెనీలు తమ ప్రాడెక్ట్స్‌ను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ఎన్నో రకాలుగా ప్రమోషన్స్‌ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే కొందరు చేసే ప్రమోషన్స్‌.

 Gas Filling Station Offer Free Gas For Two Pieces Bikini Persons-TeluguStop.com

పబ్లిసిటీ స్టంట్స్‌ ఆశ్చర్యంగా అనిపిస్తాయి.అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబోయ్‌ అనిపిస్తుంది.

ఇటీవల చెన్నైలోని ఒక చేపల వ్యాపారీ ఒక్క రూపాయికి కిలో చేపలు ఇవ్వడంతో అతడి చేపల షాపు గురించి కేవలం చెన్నైలోనే కాకుండా మొత్తం దేశ వ్యాప్తంగా కూడా తెలిసి పోయింది.అంతగా పాపులర్‌ అయిన అతడి షాపు ఇప్పుడు జోరుగా నడుస్తోంది.

ఇలాంటివి ఎన్నో రకాల ప్రమోషన్స్‌ మనం సోషల్‌ మీడియాలో చూస్తూనే ఉంటాం.

ఇప్పుడు మీ వద్దకు మరో వింతైన ప్రమోషన్‌ కార్యక్రమాన్ని తీసుకు వచ్చాం.

రష్యాలోని ఓల్వీ అనే ఒక గ్యాస్‌ ఫిల్లింగ్‌ మరియు పెట్రోల్‌ బంక్‌ ఉంది.ఆ బంక్‌ యాజమాన్యం తమ బంక్‌ వార్తల్లోకి ఎక్కాలని భావించారు.

అందుకోసం ఫ్రీ ఆఫర్‌ పెట్టారు.ఎవరైతే బికినీలో వస్తారో వారికి పెట్రోలు, గ్యాస్‌ మరియు డీజిల్‌ ఫ్రీ అంటూ ప్రకటన ఇచ్చారు.

ఈ ప్రకటనతో ఆ బంక్‌ గురించి స్థానికంగా పెద్ద చర్చ జరిగింది.అయితే ఆ బంక్‌ యాజమాన్యం ఆశ్చర్యపోయే విధంగా ఆడవారి కంటే మగవారి ఎక్కువగా బికినీలో వచ్చారు.

Telugu Gas, Heels, Russian Gas, Bikini-

ఫిల్లింగ్‌ సిబ్బంది కేవలం ఆడవారికి మాత్రమే తాము ఈ ప్రకటన చేశామంటూ చెప్పినా కూడా దయచేసి మాకు ఫ్రీ ఆఫర్‌ వర్తింప జేయండి అంటూ మగవారు బికినీల్లో వెళ్లి రిక్వెస్ట్‌ చేశారు.కొంత మంది అయితే ఏకంగా టూ పీస్‌ బికినీలో కూడా వచ్చేసి ఫిల్లింగ్‌ కోసం రిక్వెస్ట్‌ చేశారు.మగవారు ఎక్కువ వస్తున్న నేపథ్యంలో ఈ ఫ్రీ ఆఫర్‌ను ముగిస్తున్నట్లుగా యాజమాన్యం ప్రకటించింది.దీంతో ఆ ఫిల్లింగ్‌ స్టేషన్‌ గురించి ప్రపంచ వ్యాప్తంగా కూడా పబ్లిసిటీ దక్కింది.

ఇప్పుడు ఆ ఏరియాలో ఎవరికి ఫిల్లింగ్‌ కావాలన్నా కూడా ఆ ఫిల్లింగ్‌ స్టేషన్‌కు వెళ్తున్నారట.మొత్తానికి పుర్రెకో బుద్ది అన్నట్లుగా వారు చేసిన ప్రయత్నం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube