సినిమా రక్తి కట్టాలంటే అన్ని రకాల పాత్రలు ఉండాలి.కేవలం హీరో హీరోయిన్ గంతులేస్తేనో, హీరో విలన్ కొట్టుకుంటే మాత్రమే సినిమా పండదు.అన్ని పాత్రల సమ్మేళనమే సినిమా.ఇక ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో తాత పాత్ర యొక్క ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తుంది.గతంలో ఎస్వీ రంగారావు లాంటి నటుడు తనకన్నా వయసులో పెద్ద హీరోలు అయినా ఎన్టీఆర్, అక్కినేని వంటి వారికి తండ్రి లేదా తాత పాత్ర వేసి సినిమా విజయవంతం అవ్వడం తో ప్రధాన రోల్ పోషించేవాడు.ఇక ఆ తర్వాత గుమ్మడి వంటి నటులకు మాత్రమే ఇది సాధ్యమయ్యింది.
మధ్యలో కొన్నేళ్ల పాటు తాత పాత్ర దాదాపు కనుమరుగు అయ్యింది.సత్యనారాయణ వంటి వారు కొంత మేర చేసిన గుర్తుండి పోయేంత కాదు.ఇక అక్కినేని అయితే సీత రామయ్య మనవరాలు అంటూ తాత మనవరాలు కాన్సెప్ట్ తో ఒక సినిమానే తీసాడు.ఈ మధ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ రాస్తున్న సినిమాల్లో ఖచ్చితంగా తాత పాత్ర ఉండేలా చూసుకుంటున్నాడు.
గతంలో అతడు చిత్రం కోసం మహేష్ కి తాత గా నాజర్ నటించగా, అత్తారింటికి దారేది, ఆజ్నతవాసి వంటి సినిమాలో బొమ్మన్ ఇరానీ కనిపించారు.
ఆలా వైకుంఠపురంలో సచిన్ ఖేడేకర్ తాత పాత్ర పోషిస్తే ప్రకాష్ రాజ్ లాంటి నటుడు గోవిందుకు అందరి వాడేలే, శతమానం భవతి వంటి చిత్రాల్లో తాత పాత్ర వేసాడు.ఇక మహేష్ బాబు నెక్స్ట్ మూవీ కోసం మళ్లీ తాత గా ఆయనే కనిపించనున్నారట.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ హీరో గా నటిస్తున్న మారుతీ చిత్రం లో తాత పాత్ర కోసం చాల మందిని చుసిన ఎవరు సెట్ కాలేదట.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్ వంటి స్టార్ హీరో కి తాత అంటే మినిమమ్ గ్యారంటీ ఉంటుంది.అందుకే మొన్న కెజిఎఫ్ సీక్వెల్ లో కనిపించిన సంజయ్ దత్ ని ప్రభాస్ తాత క్యారెక్టర్ కోసం అడిగితే అయన ఒప్పుకున్నారట.బాలీవుడ్ లో ఇంత పెద్ద స్టార్ అయ్యి ఉంది ఒక ముసలి వేషం వేయడానికి సంజయ్ ఒప్పుకున్నారంటే సినిమాలో కథ అంత ఎలా ఉండబోతుందో అనే అంచనాలు పెరుగుతున్నాయి.