ఇదేక్కడి మ్యాగీరా బాబు... అని జుట్టుపీక్కుంటున్న నెటిజన్లు..!!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫుడ్ కు సంబంధించిన రకరకాల వీడియోలు బాగా వైరల్ అవుతూ వస్తున్నాయి.కొన్ని ఫుడ్ ఐటమ్స్ ను నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు.

 Foodie Prepares 'cotton Candy Maggi' In Viral Video , Cotton Maggie, Viral Late-TeluguStop.com

కానీ కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పట్ల నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఒరియో బిస్కెట్ తో బజ్జీలు వేయడం, గులాబ్ జామ్ పరోటా,చాక్లెట్ తో పానీపూరి, ఐస్ క్రీమ్ సమోస ఇలా భోజన ప్రియులను ఆకట్టుకోవడానికి రకరకాల పేర్లతో కొత్త కొత్త ఆహార ప్రయోగాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మ్యాగీతో ఒక వెరైటీ వంట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు మ్యాగీ నూడుల్స్ అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.

చిన్న పిల్లలు మ్యాగీ పేరు చెబితే చాలు ఎగిరి గంతులేస్తారు.అలాగే ఈ మ్యాగీ తయారుచేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు.కేవలం 2 నిమిషాల్లోనే ఎంతో రుచికరమైన మ్యాగీ తయారైపోతుంది.అలాగే మార్కెట్లో కూడా రకరకాల మ్యాగీలు.

అందుబాటులో ఉన్నాయి.తాజాగా ఓ మహిళ తన స్టైల్లో మ్యాగీ వండి అందరినీ షాక్ కు గురిచేసింది.

ఈ వీడియో సోషల్ మీడియా లో ప్రత్యక్షమయ్యింది.ఇందులో సదరు మహిళ కాటన్ క్యాండీ అంటే పీచు మిఠాయితో మ్యాగీని వండుతుంది.

అలాగే దీనికి కాటన్ క్యాండి మ్యాగీ అని పేరు కూడా పెట్టారు.మ్యాగీ అభిమానులు ఈ వీడియో చూసి అవాక్కవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ కాటన్ మిఠాయితో మ్యాగీని తయారు చేస్తున్నట్లు మనం చూడవచ్చు.ఈ మహిళ ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో కొద్దిగా వెన్న వేసి, అందులో వివిధ కూరగాయలను వేసి ఫ్రై చేసింది.

ఆ తరువాత అందులో ఉప్పు, నీరు, సుగంధ ద్రవ్యాలు జోడించింది.కాసేపు ఉడికిన తర్వాత అందులో కాటన్ మిఠాయిని వేసి మ్యాగీతో కరిగిపోయే వరకు కలిపింది.ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోని ఈట్ దిస్ ఢిల్లీ అనే పేజీలో పోస్ట్ చేయగా అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ వంటకాన్ని చూసి నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.

మ్యాగీని కూడా ఇలా వాడేసుకుంటున్నారా అంటూ జుట్టు పీక్కుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube