ఫోన్ లో యాడ్స్ బ్లాక్ చేయాలంటే..సెట్టింగ్స్ లో ఇలా చేసేయండి..!

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ల( Smart Phones ) ద్వారానే దాదాపుగా అన్ని ముఖ్యమైన పనులు సులభతరం అయ్యాయి.అయితే మనం కాస్త బిజీ గా ఉన్నప్పుడు మధ్యలో యాడ్స్ ( Ads )వచ్చి చేసే పనికి అంతరాయం కలుగుతుంది.

 Follow This Steps To Block Ads In Your Smart Phone Details, Block Ads , Smart P-TeluguStop.com

ఇక ఫోన్ ద్వారా డబ్బులు చెల్లించే సమయాల్లో యాడ్స్ వస్తే.ట్రాన్సాక్షన్స్ మధ్యలో ఆగిపోయి కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఆపిల్ ఐఫోన్ లో ప్రకటనలు కనిపించవు కాబట్టి ఆ ఫోన్ వాడే వారికి ఇలాంటి ఇబ్బందులు ఎదురు కావు కానీ ఆండ్రాయిడ్ ఫోన్లకు( Android Phones ) యాడ్స్ వస్తూనే ఉంటాయి.యాడ్ వచ్చినప్పుడు పైన కనిపించే క్రాస్ (*) నొక్కి యాడ్స్ మూసివేస్తుంటాం.

అయితే ఆండ్రాయిడ్ ఫోన్లకు యాడ్స్ రాకుండా సులభంగా బ్లాక్ చేయవచ్చు.సెట్టింగ్స్ లోకి వెళ్లి ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.యాడ్స్ ను బ్లాక్ ఎలా చేయాలో తెలుసుకుందాం.ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళాక గూగుల్( Google ) అనే ఆప్షన్ కనిపిస్తుంది.ఆ గూగుల్ పై క్లిక్ చేస్తే మ్యానేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.దానిపై క్లిక్ చేస్తే డేటా గోప్యత ఆప్షన్ కనిపిస్తుంది.

అక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే పర్సనలైజ్డ్ యాడ్స్( Personalized Ads ) అని కనిపిస్తుంది.ఇందులో మీ యాక్టివిటీలలో ఏవి ట్రాక్ అవుతున్నాయో తెలుసుకోవచ్చు.ట్రాక్ అయ్యే యాక్టివిటీల ద్వారానే ఫోన్ కు యాడ్స్ వస్తుంటాయి.అక్కడ మై యాడ్ సెంటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.దానిని క్లిక్ చేసిన తర్వాత పర్సనలైజ్డ్ యాడ్స్ టోగుల్ ఓపెన్ అవుతుంది.దాన్ని ఆఫ్ చేయాలి.

ఆ తర్వాత అక్కడ డిలీట్ advertising ID ని క్లిక్ చేస్తే చాలు.స్మార్ట్ ఫోన్ కు అనవసరమైన యాడ్స్ రావు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube