పరశురామ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ,( Vijay Devarakonda ) మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్( Family Star ) మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది.ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ కు దాదాపుగా 4 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం.
ట్రైలర్ లో మృణాల్ ఠాకూర్ హీరోను కొట్టే షాట్ తెగ హైలెట్ అయింది.అయితే పరశురామ్ విజయ్ దేవరకొండ కాంబోలో కొన్నేళ్ల క్రితం తెరకెక్కిన గీతా గోవిందం ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఫ్యామిలీ స్టార్ లో కూడా రష్మికను ( Rashmika ) హీరోయిన్ గా రిపీట్ చేసి ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.విజయ్ దేవరకొండ, రష్మిక కెమిస్ట్రీ వేరే లెవెల్ లో ఉంటుందని నెటిజన్లు చెబుతున్నారు.
మరోవైపు ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్ కాగా రష్మిక ఈ ట్రైలర్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.విచిత్రం ఏంటంటే రష్మిక పుట్టినరోజునే( Rashmika Birthday ) ఫ్యామిలీ స్టార్ మూవీ విడుదల కానుంది.

రష్మిక మందన్నా ట్విట్టర్ ద్వారా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఫ్యామిలీ స్టార్ మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుందని రష్మిక పేర్కొన్నారు.ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రష్మిక కామెంట్లు చేశారు.సినిమా సక్సెస్ సాధించిన తర్వాత పార్టీ కావాలని రష్మిక కోరారు.రష్మిక పోస్ట్ గురించి విజయ్ దేవరకొండ స్పందిస్తూ క్యూటెస్ట్ అని చెప్పుకొచ్చారు.

రష్మిక షేర్ చేసిన పోస్ట్ కు దాదాపుగా 7 వేల లైక్స్ వచ్చాయి.విజయ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉండగా ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.