రఘువరన్ … నటుడుగా ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఎంతో అద్భుతమైన చిత్రాలుగా మలచబడ్డాయి. రఘువరన్ (Raghuvaran),ఉన్నాడంటే చాలు ఆ పాత్రకు ప్రాణం పోస్తాడు అని అప్పటి దర్శకులు, నిర్మాతలు భావించేవారు.
ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్ని రకాల వివాదాలు ఉన్నా కూడా అవేవీ సినిమా సెట్ లో కనిపించేవి కాదు తాగుడు వ్యసనం ఉంది అనే ఒక అపవాది తప్ప రఘువరన్ తో ఎవరికీ వివాదాలు కూడా ఉండవు.ప్రస్తుతం ఆయన మన మధ్య లేరు కానీ ఆయన నటించిన సినిమాలన్నీ కూడా నిత్యం రఘువరన్ నీ గుర్తు చేస్తూనే ఉంటాయి.
తండ్రిగా సాఫ్ట్ పాత్రల్లో నటిస్తూనే, విలన్ గా కేవలం గొంతుతోనే విలనజాన్ని పండించగల నటుడు రఘువరన్.అంత గొప్ప నటుడు ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం.
రఘువరన్ కి భార్య రోహిణి ఒక కొడుకు ఉన్నాడు.కొడుకు పుట్టాక కొన్ని రోజులకు రోహిణి రఘువరన్ తో విడాకులు తీసుకొని దూరంగా ఉండేది అయినా రఘువరన్ మరొక పెళ్లి చేసుకోలేదు.అయితే ఇటీవల రోహిణి ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ రఘువరన్ కి సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు.అందులో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి రఘువరన్ కి ఉన్న బంధం గురించి ఆవిడ చెప్పిన మాటలకు ప్రతి ఒక్కరికి కంట కన్నీరు తెప్పిస్తుంది.
పవన్ కళ్యాణ్ ఒక హీరో గా రఘువరన్ తండ్రి గా మొట్టమొదటిగా సుస్వాగతం(Suswagatham) అనే సినిమాలో కలిసి నటించారు.ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి తండ్రిగా రఘువరన్ కనిపించగా ఒక అమ్మాయి ప్రేమ కోసం ఆరాటపడుతూ తండ్రిని ఎంతగానో ప్రేమించే పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు.
ఈ సినిమాలో నటిస్తూనే రఘువరన్ ఇంటికి వెళ్లిన తర్వాత ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉండేవారట పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఎంతో గొప్పదని పొగుడుతూ ఉండేవారట.కానీ ఈ విషయాలు ఏమీ కూడా ఆయన బ్రతికి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కి చెప్పలేదట.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో రోహిణి ఒక సినిమాను(Rohini) నటిస్తున్న క్రమంలో రఘువరన్ చెప్పిన విషయాలను పవన్ కళ్యాణ్ తో షేర్ చేసుకోగా అప్పుడు పవన్ సైతం తనకు రఘువరన్ తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడట.తాను కూడా ఎప్పుడు చెప్పాల్సిన అవసరం రాలేదు కానీ రఘువరన్ అంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పాడట పవన్ కళ్యాణ్ ఈ విషయాలను చెబుతూ రోహిణి ఎమోషనల్ అయ్యారు.