చిరంజీవి( Chiranjeevi )ని 150 చిత్రాల తర్వాత చూపించడానికి ఏముంటుంది చెప్పండి ? ఇప్పటికి అందరూ అన్ని యాంగిల్స్ లో ఆయనని చూపించేశారు.ఇక కేవలం ఆయనకు ఉన్న క్రేజ్ ను వాడుకొని ఏదో ఒక రకమైన పాత చింతకాయ పచ్చడి ని వండి వడ్డిస్తారు అంతే అని ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నారు.
కానీ చిరంజీవి నటించబోతున్న విశ్వంభర సినిమా గత అన్ని చిత్రాలకు కన్నా కూడా విభిన్నంగా ఉండబోతుందని వార్తలు ప్రస్తుతం టాలీవుడ్ లో గుప్పుమంటున్నాయి.ఆయనకు ఈ సినిమా ఖచ్చితంగా సరికొత్తగా ఉంటుందని, అందుకోసం దర్శకుడు వశిష్ఠ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అని కూడా తెలుస్తోంది.
ఇక విశ్వంభర సినిమా( Vishwambhara ) విశేషాల విషయానికి వస్తే ఈ చిత్రంలో సిస్టర్ సెంటిమెంటు ప్రధానంగా ఉండబోతుందట.ఇప్పటి వరకు ఆయన గతంలో రెండు మూడు సార్లు సిస్టర్ సెంటిమెంట్ బేస్ చేసుకుని విజయవంతమైన చిత్రాలను తీశాడు కాబట్టి ఈ సెంటిమెంట్ తో ఇది కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అంతా భావిస్తున్నారు.అంతే కాకుండా ఆయన నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ఇది.ఇప్పటి వరకు గతంలో అంజి, జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాల్లో మాత్రమే సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో సినిమా తీశారు.ఇప్పుడు మరో మారు అలాంటి సబ్జెక్టుతో చిరంజీవి రాబోతున్నారు కాబట్టి అందరూ ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.</br
ఇక ఈ సినిమాలో చాలా అద్భుతాలు ఉండబోతున్నాయట.చిరంజీవి ఒక లోకం నుంచి మరో లోకానికి వెళ్లి వెళ్తాడట.అందుకోసం వశిష్ట ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడట.
అందువల్ల సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.ఈ సినిమాలో త్రిష( Trisha ) ప్రధాన పాత్రలో నటిస్తుండగా మిగతా పాత్రల్లో ఇషా తల్వార్, అశు రంగనాథ్ వంటి వారు నటిస్తున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా చిరంజీవి కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా, యూవీ క్రియేషన్స్ వారు భారీ హంగులతో విశ్వంభర సినిమాను నిర్మిస్తున్నారు.