భారత్‌లో అమెరికా రాయబారి నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది.ఇప్పటికే ఈ పదవికి తన రైట్ హ్యాండ్ ఎరిక్ గార్సెట్టిని నామినేట్ చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
అయితే ఈ నియామకానికి కాంగ్రెస్ మద్ధతు లభించాల్సి వుంది.రిపబ్లికన్ సెనేటర్ మార్కో రూబియో అభ్యంతరం నేపథ్యంలో మార్చి 8న గార్సెట్టి నియామకానికి సంబంధించి కాంగ్రెస్‌లో ఓటింగ్ జరగనుంది.
లాస్ ఏంజెల్స్ మేయర్‌గా వున్న సమయంలో గార్సెట్టి తన కార్యాలయంలో పనిచేసే సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రూబియో సహా కొందరు సెనేట్ సభ్యులు ఆరోపణలు చేశారు.ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో గార్సెట్టిని మరోసారి భారత్‌లో అమెరికా రాయబారి పదవికి నామినేట్ చేశారు.
ఇకపోతే.ఎరిక్ గార్సెట్టికి డెమొక్రాట్లలో సమర్థుడైన నేతగా పేరుంది.మూడు దశాబ్ధాల తర్వాత వేసవి ఒలింపిక్స్‌ను అమెరికా గడ్డపైన తిరిగి నిర్వహించేందుకు ఆయన చేసిన ప్రయత్నం విజయవంతమైంది.దేశంలో అత్యంత రద్దీగా వుండే రెండో ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ అయిన లాస్ ఏంజిల్స్ మెట్రోకు గార్సెట్టి అధ్యక్షత వహిస్తున్నారు.
దీనిలో కొత్తగా 15 లైన్లను నిర్మిస్తున్నారు.అంతేకాకుండా పారిస్ వాతావరణ ఒప్పందాన్ని అమెరికాలోని 400 మంది మేయర్లు పాటించే విధంగా ఏర్పాటు చేసిన ‘‘ క్లైమేట్ మేయర్’’కు కో ఫౌండర్‌గా ఎరిక్ వ్యవహరిస్తున్నారు.
యూఎస్ నేవీ రిజర్వ్ కాంపోనెంట్‌లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా 12 ఏళ్లపాటు పనిచేసిన గార్సెట్టి.2017లో లెఫ్టినెంట్‌గా రిటైర్ అయ్యారు.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు.యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో ఫ్యాకల్టీగా కూడా పనిచేశారు.ఎరిక్.2013 నుంచి లాస్ ఏంజెల్స్ మేయర్‌గా, 12 ఏండ్లపాటు సిటీ కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారు.భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా బైడెన్ తనకు అత్యంత నమ్మకస్తుడైన ఎరిక్‌ను రాయబారిగా నామినేట్ చేశారని శ్వేతసౌథం అప్పట్లో తెలిపింది.
అమెరికా అధ్యక్షుడికి కుడిభుజంగా అభివర్ణించే ఎరిక్‌ను భారత్‌కు పంపడం వెనుక పెద్ద వ్యూహమే వుందంటున్నారు విశ్లేషకులు.భారత్‌తో దౌత్యపరంగా అత్యంత సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో ఎరిక్ నామినేషన్ వ్యవహారం అమెరికాలో ప్రాధాన్యత సంతరించుకుంది.ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని ఏకం చేయాలని అగ్ర రాజ్యాధినేత జో బైడెన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అయితే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్.ఇటీవల రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచుతున్నట్లు చెప్పింది.భారత సైనిక దిగుమతుల్లో ఎక్కువ భాగం రష్యా నుంచి వస్తోన్న సంగతి తెలిసిందే.