ఒక్కోసారి తాగిన మత్తులోనో, మరేదైనా కారణంతోనో పోలీసుల ఎమర్జెన్సీ నంబరుకు కొందరు ఫోన్ చేస్తుంటారు.వింత వింత కారణాలు చెప్పి కంగారు పెట్టేస్తుంటారు.
తీరా అక్కడకు వెళ్లిన పోలీసులు షాక్ అవుతారు.కొంత కాలం క్రితం పంజాబ్‌లో ఓ తాగుబోతు పోలీసులకు ఫోన్ చేసి హడావుడి చేశాడు.
రోడ్లపై ఏమీ తిరగడం లేదని ఏదో అయిపోయిందని ఎమర్జెన్సీ నంబరుకు ఫోన్ చేసి తెలిపాడు.వెంటనే అక్కడకు వెళ్లిన పోలీసులకు అతడు బాగా తాగిన స్థితిలో కనిపించాడు.
తీరా అతడిని విచారణ చేస్తే, తాను ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తారో లేదోనని కాల్ చేసినట్లు చెప్పాడు.
ఇదే తరహాలో ఇటీవల ఇంగ్లండ్‌లోని ఎమర్జెన్సీ నంబరుకు కొన్ని సిల్లీ రీజన్స్‌తో కాల్స్ వస్తున్నాయి.
దీంతో పోలీసులు హైరానా పడుతున్నారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఇంగ్లండ్‌లో అత్యవసర నంబరు 999కి ఇటీవల ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తున్నాయి.అయితే ప్రమాదమేదీ లేకపోయినా చిన్న చిన్న కారణాలకే పోలీసులను పిలుస్తున్నారు.
ఇటీవల ఓ మహిళ తన ఇంటికి రమ్మని పోలీసులకు ఫోన్ చేసింది.ఏదో జరిగిందని తెలుసుకుని అక్కడికి పోలీసులు కంగారుగా వెళ్లారు.
తనకు సాలె పురుగు అంటే భయమని, గోడ మీద ఉన్న దానిని తీసేయాలని పోలీసులకు చెప్పింది.దీంతో వారు విస్తుపోయారు.ఇలాంటి చిన్న కారణాలకే తమను పిలుస్తారా అంటూ మండిపడ్డారు.తమకు ఇలాంటి కాల్స్ రోజుకు 120కి పైగా వస్తున్నాయని, ఇలాంటి పనులు మానుకోవాలని ప్రజలను వారు కోరుతున్నారు.
ఎమర్జెన్సీ నంబరుకు నిజంగా అవసరం ఉన్న వారు ఫోన్ చేస్తారని, అయితే సిల్లీ కారణాలతో ఫోన్ చేసే వారి వల్ల అవసరంలో ఉన్న వారికి సాయం చేయలేకపోతున్నామని వాపోతున్నారు.