వైరల్: అరటిపళ్ళను తొక్కతీసి మరీ తింటున్న ఏనుగు... అచ్చం మనిషిలానే!

ఈ మధ్య కాలంలో చూసుకుంటే జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం.అందులోనూ ఏనుగులకు( Elephant ) సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి.

 Elephant Peels Banana Before Eating Video Viral Details, Banana Peel, Viral Late-TeluguStop.com

ఇకపోతే ఏనుగు చాలా సాధు స్వభావి. అడవి జంతువు అయినప్పటికీ శాంతం దాని ఒంటిపేరు.

అందుకే ఇవి మనుషులకు కూడా బాగా నచ్చుతాయి.అంతేకాకుండా మనుషులతో ఎంతో స్నేహభావంతో మెలుగుతాయి.

కోపమొస్తే మాత్రం గజరాజులా మారి అదే స్థాయిలో విధ్వంసాన్ని కూడా సృష్టిస్తాయి.ఇటువంటి వీడియోలు కూడా మనం అనేకం చూసాం.

కాగా ఇపుడు సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవుతున్న వీడియోని చూస్తే మాత్రం అవాక్కవుతారు.ఎందుకంటే అది అరటిపళ్ళను ( Banana ) అచ్చం మనిషి ఒలుచుకొని తిన్నట్టే తింటోంది మరి.కాగా నెటిజన్లు దీనిని చాలా లైక్ చేస్తున్నారు.ఏనుగుల ప్రవర్తన చూసి మనుషులు ఒక్కోసారి చిన్న పిల్లలు అయిపోతుంటారు.

ఇపుడు కూడా దాదాపుగా అలాంటి పరిస్థితే.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

బెర్లిన్‌ జూలో ఉన్న ఓ ఏనుగు అరటి పండును తినే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది అంటే నమ్మితీరాల్సిందే.

కావాలంటే సదరు విడియోపైన ఓ లుక్కేయండి మరి.పంగ్ ఫా అనే ఆసియా ఏనుగు అరటి పండు ఇస్తుంటే.ముందుగా అది అరటిపండు తొక్క తీసేసి ఆపై పండును మాత్రమే తింటోంది.

ఇది తినే తీరు చూస్తే అచ్చం మనిషిలానే తిన్నట్లుగా అనిపించడంతో జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ ఏమంటే పసుపు రంగులో బాగున్న అరటిపండ్లను మాత్రం తింటూ.

గోధుమ రంగు అంటే సరిగా లేని అరటి పండ్లను తినేందుకు ససేమిరా అంటోంది.దీన్ని చూసేందుకు సందర్శకులు కూడా పెద్దస్థాయిలో ఎగబడుతున్నారు.సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వైరల్ క్లిప్‌ ఇంతవరకు 98,000 వీక్షణలు పొందడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube