జీవితంలో ఎదగాలంటే మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు.తిండి కష్టాలు, ఆర్థిక కష్టాలు వేధిస్తే కెరీర్ పరంగా సక్సెస్ సాధించే విషయంలో సైతం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.
కొంతమంది సక్సెస్ స్టోరీలు విన్న సమయంలో మనకు గూస్ బంప్స్ వస్తాయి.ఇది కదా రియల్ సక్సెస్ అనే భావన కలుగుతుంది.
మహబూబాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామం దొరవారివేంపల్లికి చెందిన ఈక ప్రభాకర్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది.
చదువుకు పేదరికం అడ్డు కాదని టాలెంట్ ఉంటే ఆలస్యంగా అయినా సక్సెస్ దక్కుతుందని ఈక ప్రభాకర్( Eka Prabhakar ) ప్రూవ్ చేశారు.
ఒకవైపు సమస్యలతో సావాసం చేస్తూ మరోవైపు అనుకున్న లక్ష్యాన్ని ఈక ప్రభాకర్ సాధించారు.ప్రస్తుతం ఈక ప్రభాకర్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ అయోవాలో ప్రొఫెసర్ ( University of Iowa, USA )గా పని చేస్తున్నారు.
పాపమ్మ సమ్మయ్య దంపతుల కొడుకైన ప్రభాకర్ తన సక్సెస్ స్టోరీ గురించి ఈ విధంగా చెప్పుకొచ్చారు.
పోడు వ్యవసాయం ఆధారంగా మా కుటుంబ పోషణ జరిగేదని తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులను అనుభవించానని అన్నారు.మా గ్రామంలో స్కూల్ కూడా లేదని ఆ సమయంలో రాజేంద్ర కాన్వెంట్ హైస్కూల్( Rajendra Convent High School ) లో సీటు వచ్చిందని ఆయన పేర్కొన్నారు.వరంగల్ ఎల్.బీ కాలేజ్ లో ఇంటర్, కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ లో బీ.జెడ్.సీలో డిగ్రీ చదివానని ప్రభాకర్ అన్నారు.
వారణాసిలో( Varanasi ) ఉన్న బనారస్ హిందూ యూనివర్సిటీలో బయో టెక్నాలజీలో పీజీ పూర్తి చేశానని ఆయన పేర్కొన్నారు.ఆ తర్వాత ఐటీడీఏ నుంచి స్కాలర్ షిప్ కు ఎంపిక కావడం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు.సెంట్రల్ యూనివర్సీటీలో పీహెచ్డీ చేసి ఆ తర్వాత రీసెర్చ్ అసోసియేట్ గా పని చేశానని ప్రభాకర్ పేర్కొన్నారు.
అమెరికాలోని యూనివర్సిటీలో ప్రొఫెసర్ జాబ్ వచ్చిందని ఈ నెల 28వ తేదీన అమెరికాకు వెళ్తున్నానని ప్రభాకర్ వెల్లడించారు.