Dubbing Janaki : ఆ సీన్ కోసం కమల్ హాసన్ నా కాళ్ల మీద పడి ఏడ్చాడు.. డబ్బింగ్ జానకి షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా డబ్బింగ్ జానకికి( Dubbing Janaki ) ఊహించని రేంజ్ లో పాపులారిటీ ఉందనే సంగతి తెలిసిందే.నేను 1000 కంటే ఎక్కువ సినిమాలలో నటించానని ఆమె తెలిపారు.

 Dubbing Janaki Shocking Comments About Kamal Haasan Goes Viral In Social Media-TeluguStop.com

ఒక్కో సమయంలో తినడానికి తిండి లేక నూకలు పిల్లలకు పెట్టిన సందర్భాలు సైతం ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు.ఇతరుల దగ్గర ఏమీ లేనట్టు నిలబడకూడదని భావించేవాళ్లమని డబ్బింగ్ జానకి కామెంట్లు చేశారు.

నా ఉద్దేశం ఏంటంటే ఎవ్వరినీ అప్పు అడగకూడదని భావించానని ఆమె పేర్కొన్నారు.నాకు ఇండస్ట్రీలో సపోర్ట్ గా ఎవరూ లేరని నా కష్టంతో నేను ఎదిగానని ఆమె చెప్పుకొచ్చారు.

డైరెక్టర్స్ ఇళ్లకు వెళ్లి ఛాన్స్ అడిగేదానినని ఆమె కామెంట్లు చేశారు.నేను ఎవరితో క్లోజ్ గా ఉండనని నా పని నేను చూసుకుంటానని డబ్బింగ్ జానకి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

సినిమా ఇండస్ట్రీలో సావిత్రి( Savitri ) అంటే ఇష్టమని ఆమె వేసిన పాత్రలు ఎంతో నచ్చుతాయని డబ్బింగ్ జానకి తెలిపారు.సాగర సంగమం సినిమా( Sagara Sangamam ) గురించి ఆమె మాట్లాడుతూ కె.విశ్వనాథ్ గారితో 17 సినిమాలు చేశానని అన్నారు.ఆ సినిమాలో ఒక సీన్ కోసం కమల్ హాసన్( Kamal Haasan ) కాళ్ల మీద ఏడ్చాడని ఆ సమయంలో కొంతమంది కమల్ ఆమె కాళ్ల మీద పడటం ఏంటని అన్నారని డబ్బింగ్ జానకి చెప్పుకొచ్చారు.

కొంతమందికి ఇగోస్ ఉంటాయని కానీ కమల్ మాత్రం ఆ సీన్ ను సీన్ లా చేసి ఆకట్టుకున్నారని డబ్బింగ్ జానకి వెల్లడించారు.సీన్ లో పాల్గొంటున్నామంటే అక్కడ కమల్, డబ్బింగ్ జానకి కాదని పాత్రలు మాత్రమే ఉంటాయని ఆమె అన్నారు.డబ్బింగ్ జానకి వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం డబ్బింగ్ జానకికి ఎక్కువగా సినిమా ఆఫర్లు అయితే రావడం లేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube