హైదరాబాద్ లో కుక్కల బెడద ఎక్కువైంది.ఈ క్రమంలో జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతోంది.
దాదాపు 36 గంటల్లో 15 వేల ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.గంటకు 416 ఫిర్యాదులను జీహెచ్ఎంసీ తీసుకుంది.
ఇటీవల అంబర్ పేటలో జరిగిన కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.ఈ ఘటన తర్వాత ఫిర్యాదుల సంఖ్య మరింత పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు కుక్కల బెడద, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.