వైద్యుల ప్రయోగం విజయవంతం..ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏతో జన్మించిన శిశువు..!

ప్రపంచంలోనే మొదటిసారి ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏ తో ( DNA )జన్మించిన శిశువు.యూకే లో తల్లిదండ్రుల నుంచి 99.8 శాతం డీఎన్ఏ , మిగిలినది మహిళా దాత డీఎన్ఏతో శాస్త్రీయ పద్ధతిలో చేసిన ప్రయోగం ఫలించింది.ఈ ప్రయోగం చేయడానికి ప్రధాన కారణం మైటోకాండ్రియల్( Mitochondrial ) వ్యాధులతో పిల్లలు పుట్టకుండా నిరోధించడమే.

 Doctor's Experiment Is Successful..baby Born With Dna Of Three People..! , Dna-TeluguStop.com

ఎందుకంటే మైటోకాండ్రియల్ వ్యాధులతో పుట్టిన శిశువులకు కొద్ది గంటల్లోనే ప్రాణాంతకం కావచ్చు.ఈ వ్యాధులను నివారించడం చాలా కష్టం.చాలా కుటుంబాలు తమ పిల్లలను ఈ వ్యాధుల వల్ల కోల్పోతున్నారు.దాదాపుగా మైటోకాండ్రియల్ వ్యాధులతో జన్మించిన చాలామంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ వ్యాధుల భారి నుండి పుట్టే శిశువులను సంరక్షించుకోవడం కోసం 2015లో యూకేలో( United Kingdom ) పిల్లలను సృష్టించేందుకు కొత్త చట్టాలు ప్రవేశపెట్టబడ్డాయి.ఈ క్రమంలో శిశువులను రక్షించడం కోసం ఈ ప్రయోగం ఎంతో బాగా ఉపయోగపడింది.

కణాలలో జరిగే జీవన క్రియ చర్యలకు అవసరమైన శక్తిని మైటోకాండ్రియాలు సిద్ధం చేసి ఉంచుతాయి.కాబట్టి మైటోకాండ్రియాలను కణం యొక్క శక్త్యాగారాలు గా అభివర్ణిస్తారు.అయితే మైటోకాండ్రియా లో ఏదైనా లోపం ఉంటే శరీరానికి శక్తి అందించడంలో అది విఫలం అవుతుంది.

Telugu Baby, Brain, Doctors, Latest Telugu, Mitochondrial, Muscles, Kingdom-Telu

దీంతో శరీరంలో ఉండే మెదడు, కండరాలు, గుండె బలహీనపడి క్షీణిస్తాయి.ఇంత విలువైన మైటోకాండ్రియా తల్లి ద్వారా బిడ్డకు అందుతుంది.అలా అందే క్రమంలో అందులో ఏదైనా లోపం ఉంటే పుట్టే శిశువులకు అందత్వం రావచ్చు.

అంతేకాకుండా ఆ శిశువు చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.

Telugu Baby, Brain, Doctors, Latest Telugu, Mitochondrial, Muscles, Kingdom-Telu

మైటోకాండ్రియాల్ డొనేషన్ ట్రీట్మెంట్ ద్వారా ఆరోగ్యమైన దాత అండం నుంచి మైటోకాండ్రియాను ఉపయోగించే ఐవీఎఫ్ యొక్క సవరించిన రూపం.ఈ టెక్నాలజీ శిశువులను రక్షించే ఉత్తమ ఎంపికగా భావించవచ్చు.తద్వారా పుట్టే పిల్లలు ఆరోగ్యకరంగా పుడతారు.

మహిళా దాత యొక్క డిఎన్ఏ కేవలం మైటోకాండ్రియాను తయారు చేయడానికి మాత్రమే సంబంధించినది.దాత డీఎన్ఏ ఎటువంటి ఇతర లక్షణాలను ప్రభావితం చేయదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube