అక్కినేని అఖిల్ కెరీర్ స్టార్ట్ చేసి ఎన్నో రోజులు అవుతున్న ఈయన కెరీర్ లో చేసిన సినిమాలు ఐదు మాత్రమే.కానీ ఈ ఐదు సినిమాలలో కూడా బ్లాక్ బస్టర్ అయ్యిన ఒక్క సినిమా కూడా లేదు.
బ్యాచిలర్ సినిమాతో పర్వాలేదు అనిపించుకుని పరువు నిలుపు కున్న అఖిల్ మళ్ళీ ”ఏజెంట్” సినిమాతో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
అఖిల్( Akhil ) ను మాస్ హీరోగా ఏజెంట్ సినిమాతో సురేందర్ రెడ్డి( Surender Reddy ) ప్రమోట్ చేయాలి అనుకుంటే కథ కథనాలు తీవ్రంగా నిరాశ పరచడంతో ఈ సినిమా మిగతా సినిమాల కంటే ఘోరంగా విఫలం అయ్యింది.
ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా మొదటి షో తోనే తేలిపోయింది.కనీసం సగం బడ్జెట్ కూడా రాబట్టలేక పోయింది.
ఇక ఈ సినిమా తర్వాత ఈయన చేయబోయే నెక్స్ట్ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
పలు ప్రముఖ నిర్మాణ సంస్థలు అఖిల్ తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయట.ముందుగా ఈ లిస్టులో యూవీ క్రియేషన్స్ వారు ఉన్నట్టు తెలుస్తుంది.యూవీ క్రియేషన్స్ లోనే ఈయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుంది అని సాహో సినిమాకు పని చేసిన అనిల్ కుమార్( Anil Kumar ) డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వనున్నాడు అని టాక్ గట్టిగానే వినిపించడంతో ఆల్ మోస్ట్ ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయినట్టే అంటున్నారు.
అయితే ఈ హీరో నుండి కానీ, నిర్మాణ సంస్థ నుండి కానీ ఎలాంటి అఫిషియల్ అప్డేట్ రాకపోయిన ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల ఊహాగానాలు సైతం వస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం యూవీ వారు అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా ఇది రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా అనౌన్స్ మెంట్ ఉండవచ్చని అంటున్నారు.