నిన్నటితరం మనకెంతో నచ్చిన ఈ యాంకర్స్ గుర్తు ఉన్నారా..?

బుల్లితెర లో ఏదయినా కార్యక్రమం ప్రసారమయితే ఆ కార్యక్రమంలో లీనం అయ్యే లాగా, వారిని ఆనందపరుస్తూ వారికీ ఉత్సహాన్ని ఇస్తూ వాళ్ళతో కేరింతలు పెట్టిస్తారు మన యాంకర్స్.ఈ విధంగా యాంకర్స్ ఆ కార్యక్రమాలను ప్రేక్షకులకు హత్తుకుని పోయేలాగా యాంకరింగ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో.

 Do You Remember These Famous News Readers-TeluguStop.com

ఒకప్పుడు సినిమా హీరోయిన్లు, టీవీ యాంకర్ ల మధ్య చాలా అంతరం ఉండేది.కానీ ఇపుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

మార్కెట్ పరంగా సినిమా రంగానికి దీటుగా బుల్లితెర రంగం కూడా పోటీపడుతుండడంతో అందం, సెక్సీ లుక్ తో పాటు మాట తీరుతో ఆకట్టుకునే యాంకర్స్ కి డిమాండ్ బాగా పెరిగింది.ఈ మధ్యకాలంలో పలువురు యాంకర్లకు కూడా సినిమాల్లో హీరోయిన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అవకాశాలు వస్తున్నాయి.

 Do You Remember These Famous News Readers-నిన్నటితరం మనకెంతో నచ్చిన ఈ యాంకర్స్ గుర్తు ఉన్నారా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మరోవైపు యాంకరింగ్ రంగంలో కూడా సంపాదన బాగానే ఉంటుంది.సినిమా రంగంలో అయినా, టెలివిజన్ రంగంలో అయినా ఒకసారి పాపులారిటీ వస్తే అవకాశాలతో పాటు సంపాదన కూడా అమాంతం పెరిగిపోతుంది.

అందులో కొందరు యాంకర్స్ మాత్రం రోజు ఎదో ఒక షో తో మనల్ని పలకరిస్తూ ఉంటే ఇంకొందరు మాత్రం అసలు మనకు కనపడకుండా పోయారు.అలాగా ఒక్కప్పుడు అద్భుతమైన యాంకరింగ్ లతో మనల్ని అలరించి ప్రస్తుతం మనకి కనపడకుండా పోయిన యాంకర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

Telugu Etv Pragathi, Likhitha News Reader, News Readers, Pragathi-Telugu Stop Exclusive Top Stories

ఈ లిస్ట్ లో మొదట వచ్చే యాంకర్ పేరు ప్రగతి ఈవిడ అప్పట్లో ఈ టీవీ లో రాత్రి 9 గంటలకు న్యూస్ చదవటానికి వచ్చేది.న్యూస్ రీడర్ అయినా కానీ ఆవిడకి ఫాన్స్ ఏమీ తక్కువ కాదు.కొందరు న్యూస్ కోసం తొమ్మిది అయింది అంటే చాలు ఈ టీవీ పెట్టుకుంటారు.మరి ఇంకొందరైతే ప్రగతి ఆ రోజు ఏం చీరకట్టుకుంది చూద్దామని న్యూస్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు.

ముఖ్యంగా ఆడవాళ్లు అయితే మరి.ప్రగతి మంచి న్యూస్ రీడర్ స్పష్టమైన ఉచ్చారణ కలిగి, కంచు కంఠంతో వార్తలు చదివేది.న్యూస్ ఛానెల్స్ ఎక్కువ అవ్వడం వలనో లేక ఇంట్రెస్ట్ లేకపోవడం వలనో గాని ప్రగతి టీవీలో కనబడి చాలా రోజులు అయింది.

Telugu Etv Pragathi, Likhitha News Reader, News Readers, Pragathi-Telugu Stop Exclusive Top Stories

ఇంకా మరొక యాంకర్ మైథిలి.ఈటీవీ లో ప్రగతి న్యూస్ కి ఎంత ఫేమస్ అయ్యిందో, జెమినీ టీవీ లో న్యూస్ కి కూడా మైథిలి అంతే ఫేమస్.ఆవిడ పేరు మనకి పెద్దగా తెలియదు కానీ, ఆవిడ ఫేస్ చుసిన, వాయిస్ విన్నాగాని ఇట్టే గుర్తుపట్టేస్తాము.

జెమినీ టీవీ లో ఒకప్పుడు న్యూస్ వచ్చేటప్పుడు మైథిలినే న్యూస్ చదివేది.ఆమె న్యూస్ మాత్రమే కాదు కొన్ని ప్రోగ్రామ్స్ కి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ కూడా ఇచ్చింది ఇక ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు మైథిలినే యాంకరింగ్ కి దూరంగా ఉంటుంది.

Telugu Etv Pragathi, Likhitha News Reader, News Readers, Pragathi-Telugu Stop Exclusive Top Stories

మరొక యాంకర్ అనిత ఆప్టే జెమినీ టీవీ లో కొన్ని బిగినింగ్ షోస్ కి యాంకర్ గా చేస్తూ, ఇంకొన్ని షోస్ కి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేది అనిత.మంచి వాయిస్, మాడ్యులేషన్, డిక్షన్ ఆవిడ స్పెషాలిటీ.ఈవిడ భర్త హేమంత్ ఆప్టే తో కలిసి కొన్ని షోస్ ను ప్రొడ్యూస్ కూడా చేస్తుంది.తరువాత యాంకరింగ్ కూడా చేయడం మానేసింది.

కా మరొక యాంకర్ లిఖిత కామిని.జెమినీ టీవీ ఇంట్రడ్యూస్ చేసిన యాంకర్స్ లో ఇంకొక టాలెంటెడ్ యాంకర్ లిఖిత కామిని ఒకరు.

తెలుగమ్మాయి అయిన లిఖిత చక్రవాకం సీరియల్ తో బాగా ఫేమస్ అయ్యి మొగలిరేకులు సీరియల్ లో కూడా నటించింది.ఆ రెండు సీరియల్స్ లిఖిత కి మంచి గుర్తింపు తెచ్చాయి.

తరువాత పెళ్లి చేసుకుని రియల్ లైఫ్ లో బిజీ అయిపొయింది.లిఖితకు ఒక బాబు కూడా ఉన్నాడు.

మరొక యాంకర్ కీర్తిజెమినీ టీవీ లో ప్రసారం అయ్యే.యువర్స్ లివింగ్ల్, నీ కోసం ప్రోగ్రామ్స్ తో చాలా ఫేమస్ అయింది కీర్తి.తర్వాత జెమినీ టీవీ, తేజ టీవీ లో కొన్ని ప్రోగ్రామ్స్ కి హోస్ట్ గా చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత చాలా రోజులకి టీవీ 5 లో ఒక ప్రోగ్రామ్ కి యాంకరింగ్ చేసిన కీర్తి మళ్ళీ కనపడకుండా పోయింది.

ఇలా చూస్తూ పోతే ఒక్కప్పుడు ఫేమస్ అయిన చాలా మంది యాంకర్స్ ఇప్పుడు బుల్లితెరకి దూరంగా ఉంటూ పర్సనల్ లైఫ్ లో బిజీ గా ఉంటున్నారు.

#Etv Pragathi #Pragathi #LikhithaNews

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు