Namrata Mahesh Babu : వామ్మో మహేష్ పై కోపం వస్తే నమ్రత అలాంటి పని చేస్తుందా… మహేష్ నిజంగానే లక్కీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మహేష్ బాబు ( Mahesh Babu ) ఇండస్ట్రీలోకి బాలనటుడిగానే అడుగుపెట్టి అనంతరం హీరోగా ఎంట్రీ ఇచ్చారు.ఇలా హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన వంశీ సినిమా సమయంలో బాలీవుడ్ నటి నమ్రత తో కలిసి ఈ సినిమాలో నటించారు.

అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడం ఆ ప్రేమ పెళ్లి వరకు దారి తీయడం జరిగింది.ఇలా ప్రేమలో దాదాపు 5 సంవత్సరాల పాటు మునిగి తేలినటువంటి నమ్రత మహేష్ బాబు వివాహం చేసుకొని ప్రస్తుతం వైవాహిక జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్న ఈ దంపతులకు ఎందరికో ఆదర్శంగా నిలిచారు అని చెప్పాలి.

నమ్రత బాలీవుడ్ హీరోయిన్( Bollywood ) అయినప్పటికీ పెళ్లి తర్వాత సినిమాలలో నటించకుండా పూర్తిగా సినిమాలకు దూరమై కేవలం కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ కోడలిగా తల్లిగా తన బాధ్యతలను చక్కబెడుతున్నారు.

Telugu Angry, Bollywood, Mahesh Babu, Namrta, Sitara, Tollywood-Movie

ఇలా ఇంటి వ్యవహారాలను చక్కబెడుతూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా నమ్రత దూసుకుపోతున్నారు.ఇంటి బాధ్యతలన్నింటినీ నమ్రత( Namrata ) తీసుకోవడంతో మహేష్ బాబు ఇంటి వ్యవహారాలపై ఏమాత్రం కంగారు పడకుండా పూర్తిగా తన దృష్టిని సినిమాలపై పెట్టారు.దీంతో ఈయన ఇండస్ట్రీలో కూడా మంచి సక్సెస్ సాధించారు.

ఇలా వీరిద్దరి దాంపత్య జీవితం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిందనే చెప్పాలి.ఇక ఎంత అన్యోన్యంగా ఉన్నప్పటికీ భార్యాభర్తలు అన్న తర్వాత వారిద్దరి మధ్య గొడవ రావడం సర్వసాధారణం.

Telugu Angry, Bollywood, Mahesh Babu, Namrta, Sitara, Tollywood-Movie

ఇక మహేష్ బాబు( Mahesh babu ) చేసే కొన్ని పనుల కారణంగా నమ్రతకు విపరీతమైనటువంటి కోపం వస్తుందట.ఇలా కోపం వచ్చినప్పుడు మహేష్ బాబుతో గొడవ పడుతుందని అయితే ఈ గొడవ పడి మహేష్ బాబు పై కోపం వచ్చినప్పుడు నమ్రత ఒక్క క్షణం పాటు కూడా ఇంట్లో ఉండరట.వెంటనే ఈమె షాపింగ్ కి వెళ్ళిపోయి పూర్తిగా తనకి ఇష్టమైన విధంగా షాపింగ్ చేసుకొని తిరిగి ఇంటికి వస్తాడట అంతలోపు మహేష్ పై ఉన్న కోపం తొలగిపోతుందని దాంతో ఇద్దరు తిరిగి ఎప్పటిలాగే సంతోషంగా మాట్లాడుకుంటారని తెలుస్తోంది.

Telugu Angry, Bollywood, Mahesh Babu, Namrta, Sitara, Tollywood-Movie

ఇలా కోపం వస్తే భర్త పై రివెంజ్ తీర్చుకునే భార్యలను మనం చూస్తున్నాం కానీ నమ్రత మాత్రం మహేష్ బాబుని ఒక్క మాట కూడా అనకుండా కోపం వస్తే వెంటనే షాపింగ్ కి వెళ్ళిపోతుందనే విషయం తెలియడంతో మహేష్ బాబు నిజంగా లక్కీ హస్బెండ్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.ఇక వీరిద్దరి మధ్య ఎక్కువగా గొడవలు చోటు చేసుకునేది కేవలం పిల్లల విషయంలో మాత్రమేనని పలు సందర్భాలలో మహేష్ తెలియజేశారు.పిల్లలను నమ్రత బాగా కంట్రోల్ చేస్తుంది కానీ తాను పిల్లలను వెనుకేసుకుని రావడం వల్ల ఇద్దరు మధ్య గొడవలు తలెత్తుతాయని పలు సందర్భాలలో మహేష్ వెల్లడించారు.

ఏదిఏమైనా ఎంత గొడవ పడినా వీరిద్దరూ మాత్రం ఎంతోమంది సెలబ్రిటీలకు ఆదర్శమని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube