ఎన్టీఆర్ స్పందించకపోతే వచ్చిన నష్టమేంటి.. తారక్ ను అవమానించినప్పుడు వాళ్లు స్పందించారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrababu Arrest ) గురించి స్పందించలేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.కొంతమంది అయితే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడబోమంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 Fans Reaction About Negative Comments On Junior Ntr Details Here Goes Viral In-TeluguStop.com

అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ స్పందించకపోతే వచ్చిన నష్టమేంటి అంటూ ఒకింత ఘాటుగా స్పందిస్తున్నారు.

Telugu Chandrababu, Ntr, Ntr Fans-Movie

గత కొన్నేళ్లలో వేర్వేరు సందర్భాల్లో తారక్( Junior NTR ) కు అవమానాలు ఎదురయ్యాయని అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ తనకు ఎదురైన అవమానాల గురించి వెల్లడించి స్పందించాలని కోరారా? అంటూ నెటిజన్ల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.తారక్ గతంలో పలు సందర్భాల్లో స్పందించినా ఆ స్పందన విషయంలో ట్రోల్స్ చేశారని స్పందించి మరీ తారక్ ట్రోలింగ్ కు గురి కావడం అవసరమా అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఎంత తొక్కాలని చూస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ అంతకంతకూ పైకి ఎదుగుతున్నాడని ప్రస్తుతం తారక్ రాజకీయాలకు( Junior NTR Politics ) పూర్తిస్థాయిలో దూరంగా ఉన్నాడని తారక్ ను అనవసర వివాదాల్లోకి లాగవద్దని ఫ్యాన్స్ కోరుతున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ( TDP ) అవసరాలకు అనుగుణంగా వాడుకుంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చంద్రబాబు, తారక్ మధ్య ఉన్న సమస్యల గురించి తెలియకుండా ఎన్టీఆర్ ను నిందించడం ఎంతవరకు కరెక్ట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి

Telugu Chandrababu, Ntr, Ntr Fans-Movie

జూనియర్ ఎన్టీఆర్ నోరు మెదిపితే వాస్తవాలు బయటకు వస్తాయని సైలెంట్ గా ఉన్న తారక్ ను రెచ్చగొట్టడం సరికాదని నెటిజన్లు ఫీలవుతున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ జోలికి వస్తే ఫ్యాన్స్ రియాక్షన్( NTR Fans ) కూడా మరో విధంగా ఉండనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube