ఏపీలో ఉన్న ధనిక దేవాలయాల లిస్టులో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైలం చేరింది.మొదటి స్థానంలో తిరుమల ఉండగా.
రెండో స్థానంలో శ్రీశైలం చోటు సంపాదించింది.
శ్రీశైలం ఆలయానికి నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 4,500 ఎకరాలు భూమిని బదలాయించేందుకు అటవీశాఖ అంగీకరించింది.
అయితే ఆలయానికి సమీపంలో ఉన్న ఈ భూమి కోసం కొన్నేళ్లుగా దేవాదాయ, అటవీ శాఖలు పోరాడుతున్న విషయం తెలిసిందే.తాజాగా చారిత్రక రికార్డులతో దేవాదాయ శాఖ ఆధారాలు చూపించడంతో భూమి ఆలయ నిర్వహణలోకి వచ్చింది.