సినిమా ఇండస్ట్రీ లో కొందరు హిట్టు ప్లాప్ లతో సంభంద లేకుండా సినిమాలు చేస్తూ ఉంటారు.అలా సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్న యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం, ఆది సాయికుమార్ ఇద్దరిని కూడా మనం ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.
వీళ్లిద్దరూ అసలు హిట్టు ప్లాప్ తో సంబందం లేకుండా నెల కి ఒక సినిమాని రిలీజ్ చేస్తూ వెళ్తున్నారు.కిరణ్ అబ్బవరం అయితే వినరో భాగ్యం విష్ణు కథ అనే సినిమా రిలీజ్ అయి ఇంకా వన్ మంత్ కూడా కాకముందే మళ్ళీ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మీటర్ అనే సినిమాతో వస్తున్నాడు.
ఇది అనే కాదు ఇంతకు ముందు కూడా ఈయన చాలా సినిమాలని ఇలానే చేస్తూ వచ్చాడు.

ఇక ఆది సాయి కుమార్ అయితే లాస్ట్ ఇయర్ లో ఒక 5 సినిమాలు రిలీజ్ చేసి ఇప్పుడున్న యంగ్ హీరోల ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులని క్రియేట్ చేస్తున్నాడు.రీసెంట్ గానే పులిమేక అనే సినిమాతో వచ్చాడు అది ఇంకా థియేటర్ లోనే ఉంది.ఇప్పుడు మరో సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
ఇలా కుర్ర హీరోలు ఎవ్వరికీ సాధ్యం కానీ రికార్డులని క్రియేట్ చేస్తున్నారు వీళ్లిద్దరూ కూడా హిట్ కొట్టి చాలా రోజులే అవుతుంది.అయిన కూడా వీళ్లనే ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయి వీళ్లతోనే సినిమాలు చేయడం చూస్తున్న మిగితా కుర్ర హీరోలు వీళ్ళ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
వీళ్ళకి ప్రస్తుతం ఒక హిట్ అయితే పడాలి లేకపోతే ఎన్ని సినిమాలు చేసుకుంటూ పోయిన రోజు రోజుకి మార్కెట్ డౌన్ అవ్వడమే తప్ప ఇంకొకటి ఏం ఉండదు అలా ఒకసారి కనక హీరో మార్కెట్ డౌన్ అయిపోయింది అంటే ఇక మళ్ళీ ఆ మార్కెట్ ని పెంచడం చాలా కష్టం అనే చెప్పాలి.