Aarti Chabria: ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. 300కు పైగా యాడ్స్.. 10 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరం?

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ( Celebrities ) ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తారలు ఆ తర్వాత కనుమరుగైపోతూ ఉంటారు.అలా కనుమరుగైపోయిన వారు ఆ తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ అంటూ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ ఉంటారు.

 Do You Know Actress Who Acted Okariki Okaru Movie Heroine Aarti Chabria-TeluguStop.com

ఇంకొందరు కొన్ని ఏళ్ల తర్వాత సోషల్ మీడియాలో, బయట కనిపించి అభిమానులకు షాక్ ఇస్తుంటారు.అలా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక హీరోయిన్ కి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అప్పట్లో తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించింది.ఒక ఐటం సాంగ్‌ కూడా చేసింది.

తెలుగుతో పాటు హిందీలో కూడా పలు సినిమాలలో నటించింది.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ హోస్ట్‌గా వ్యవహరించిన ఖత్రోన్‌ కె ఖిలాడీ( Khatron Ke Khiladi 4 ) నాలుగో సీజన్‌ విజేతగానూ అవతరించింది.ఆమె మరెవరో కాదు ఆర్తి చాబ్రియా.( Aarti Chabria ) ఈమె మూడేళ్లకే మోడల్‌ అయిందంటే ఎవరైనా నమ్ముతారా? మ్యాగీ, పెప్సొడెంట్‌, అమూల్‌, క్రాక్‌ ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని యాడ్స్‌లో ఆమె మెరిసింది.అలా పది ఇరవై కాదండోయ్ దాదాపు 300కు పైగా యాడ్స్ లో నటించింది ఆర్తి.అంతేకాకుండా యాడ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె బాలీవుడ్‌లో స్టార్‌ హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది.1999లో మిస్‌ ఇండియా( Miss India ) వరల్డ్‌వైడ్‌ కిరీటాన్ని కూడా అందుకుంది.మోడల్‌గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్న ఆర్తి మ్యూజిక్‌ వీడియోలలోనూ నటించింది.

ఆ తర్వాత 2002లో తుమ్‌సే అచ్చా కౌన్‌ హౌ సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసింది.మధుర క్షణం( Madhura Kshanam ) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.గోపి గోడమీద పిల్లి, ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి-వీధిలో కుమారి చిత్రాల్లో నటించింది.చింతకాలయ రవి చిత్రంలో ఐటం సాంగ్‌లోనూ మెరిసింది.ఆర్తి చాబ్రియా ముంబై వారణాసి ఎక్స్‌ప్రెస్‌ అనే లఘు చిత్రానికి దర్శకనిర్మాతగా వ్యవహరించింది.ఈ షార్ట్‌ ఫిలిం ఎన్నో అవార్డులను కొల్లగొట్టింది.2013లో వ్యాహ్‌ 70 కి.మీ అనే సినిమాలో చివరిసారిగా నటించింది.తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఈ బ్యూటీ 2019లో అంతర్జాతీయ ట్యాక్స్‌ కన్సల్టెంట్‌ అయిన విశారద్‌ను పెళ్లి చేసుకొని మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ సినిమాలకు పూర్తి దూరంగా ఉంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube