ఇక్కడ బ్యాంకు ఖాతా అనేది దాదాపుగా అందరికీ తప్పనిసరి అయిపోయింది.వివిధ లావాదేవీలు నెరపడానికి రైతులనుండి వ్యాపారస్తుల వరకు బ్యాంకు ఖాతా తెరవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
ఇకపోతే మన దేశంలో మొత్తం 34 బ్యాంకులు ఉన్నాయి.వాటిలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు కాగా మిగతావి ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంక్స్.
అయితే అందులో 10 బ్యాంకులు అనేవి మంచి ఫామ్ లో వున్నాయి.ఇపుడు వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఈ లిస్టులో మొదటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( State Bank of India ) ఫార్చ్యూన్ 500 కంపెనీల లిస్టులో SBI ఉంది.ఇది భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ.ఆ తరువాతది పంజాబ్ నేషనల్ బ్యాంక్( Punjab National Bank ).ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందినది.రూ.18,09,587 కోట్ల ప్రపంచ వ్యాపారంతో దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా రికార్డులకెక్కింది.ఈ లిస్టులో 3వది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా</em ఇది భారతదేశంలో ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటి.బ్యాంక్ మూలధనంలో భారత ప్రభుత్వ వాటా 89.07శాతంగా వుంది.తరువాత ఇక్కడ చెప్పుకోదగ్గ బ్యాంకు హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ లేదా HDFC బ్యాంక్.
దేశవ్యాప్తంగా వీటి శాఖలు 5,608కి పైగా ఉన్నాయి.అలాగే 2, 902 కంటే ఎక్కువ పట్టణాలలో వీటి బ్రాంచులు కలవు.
ఈ లిస్టులో తరువాత చెప్పుకోదగ్గది ఐసిఐసిఐ బ్యాంక్( ICICI Bank )ఇది ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులలో ఒకటి.భారత ప్రభుత్వం, భారతీయ పరిశ్రమల ప్రతినిధులు 1955లో ఐసిఐసిఐని ఏర్పాటు చేశారు.ఆ తరువాత కోటక్ మహీంద్రా ఫైనాన్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి.ప్రస్తుతం ఇది భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ఆర్థిక సంస్థగా ఎదిగింది.కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు 1,600 కంటే ఎక్కువ బ్రాంచులు వున్నాయి.దీని తరువాత బ్యాంక్ ఆఫ్ బరోడా లిస్టులో వుంది.
ప్రపంచంలోని 19 దేశాలలో ఇది వ్యాపించి వుంది.తరువాత వరుసగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, కెనరా బ్యాంక్ నిలిచాయి.