ఏపీలో అధికార వైఎస్సార్‌సీపీలో కేవలం కొన్ని వర్గాల నేతల పెత్తనమే నడుస్తోందని వారి హవానే ఉందన్న చర్చలు కొంత కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి.వారి దెబ్బతో అదే పార్టీలో మిగిలిన సామాజిక వర్గాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం విస్తుపోతోన్న పరిస్థితి.
చాలా మంది నేతలు ఎంత సీనియార్టీ ఉన్నా డమ్మీలు అయిపోయారన్నది వాస్తవం.తాజాగా ఓ డిప్యూటీ సీఎం సైతం గ్రూపుల గోల తట్టుకోలేక రాజకీయాల నుంచి తప్పుకోమంటారా ? అని సొంత పార్టీ నేతల ముందే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి.
చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తన సొంత పార్టీ నేతల వద్ద రాజకీయాల నుంచి తప్పుకోమంటారా ఏంటి అంటూ లబోదిబోమన్నారట.ఆయన ఆవేదనకు చాలా కారణాలే ఉన్నాయి.
చిత్తూరు జిల్లాలో సొంత పార్టీలోనే నడుస్తోన్న గ్రూపు తగాదాలపై ఆయన కొంత కాలంగా ఆవేదనతో ఉన్నారు.అదే జిల్లాకు చెందిన మరో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా ముందు.
డిప్యూటీ సీఎంగా ఉండి కూడా నారాయణ స్వామి ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.

ఇటీవల ఓ వేదిక మీద పెద్దిరెడ్డి నారాయణ స్వామిని డిప్యూటీ సీఎంగా ఉన్నావ్.బుద్ధి, జ్ఞానం ఉందా ? అన్న వీడియో వైరల్ అయ్యింది.దీనిని బట్టే నారాయణ స్వామికి వైసీపీలో జిల్లాలో ఎలాంటి విలువ ఇస్తున్నారో అర్థమవుతోంది.
ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలను గ్రామాల నుంచే తరిమి వేయాలని సొంత పార్టీకి చెందిన నేతలు ఒత్తిడి చేస్తున్నారట.ఇది సరికాదని ఆయన చెప్పినా వినిపిచుకునే వారే లేరట.
ఇక జిల్లాలో సంక్రాంతికి జల్లికట్టు ఎప్పుడూ సంప్రదాయంగా నిర్వహిస్తూ ఉంటారు.
అయితే ఈ సారి ప్రభుత్వం నుంచి జల్లికట్టుకు అనుమతులు రాలేదు.
దీంతో మంత్రి ముందే వైసీపీ నేతలు ఫైర్ అవ్వడంతో పాటు.ఇలా అయితే ఎలా ? అని నిలదీశారట.దీంతో నారాయణ స్వామి తాను అందరి నేతల్లా రాజకీయాలు చేయలేనని.ప్రతిపక్ష నేతలను గ్రామాల నుంచి తిరిమి వేయలేనని.అలాగే జల్లికట్టు విషయంలో కూడా తాను ఏం చేయలేకపోయానని తన నిస్సహాయత వ్యక్తం చేశారట.ఇక గ్రూపు రాజకీయంలో నలిగిపోయే నారాయణ స్వామి ఇలా తన నిస్సహాయత వ్యక్తం చేశారని అంటున్నారు.